శనివారం సాయంత్రం జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్నీ ప్రాంతాల్లో భారత జవాన్లు, సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాయి పాక్ బలగాలు. మోర్టార్ బాంబులను విసిరాయి. ఈ ఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. భారత బలగాలు దీటుగా స్పందించాయి.
నాలుగు రోజుల్లో ఇద్దరు జవాన్లు...
గత నాలుగు రోజులుగా పాకిస్థాన్ దుశ్చర్యలకు ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గురువారం సుందర్బాని సెక్టార్లో జరిగిన కాల్పుల్లో ఆర్మీ జవాన్ యష్ పాల్ మృతి చెందాడు.
2018లో 2,936 ఘటనలు
ఈ ఏడాది ఇప్పటి వరకు 125 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్.
2003లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 15 ఏళ్లలో అత్యధికంగా 2018లోనే 2,936 ఘటనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండీ: మాలిలో వేటగాళ్ల ఊచకోతకు 115 మంది బలి