నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్లో సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యం సోమవారం ప్రకటించింది.
రాజౌరీ జిల్లాలో నౌషెరా సెక్టార్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఐదు రోజుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడటం వల్ల.. నలుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:పాక్ 'బ్లాక్లిస్ట్' భవితవ్యం తేలేది ఈ నెలలోనే