దాయాది దేశం పాక్ ఉగ్రకుట్రలను భగ్నం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది భారత్. నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాట్లను అడ్డుకొనేందుకు జమ్ముకశ్మీర్‌లోని గురుజ్ సెక్టార్ వద్ద సైన్యాన్ని పెంచుతుంది. పాక్ సరిహద్దుల్లో అదనంగా 3000 మంది సైనికులను మోహరించింది.
పాక్ ఆటలు సాగలేదు!
అదనపు బలగాల మోహరింపు వల్ల చొరబాటు దారులు, ఉగ్రవాదులను అడ్డుకోవడంలో ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయని ఓ అధికారి తెలిపారు. అక్టోబర్-నవంబర్ మధ్య ఎక్కువ మంచు కురిసే కాలంలో ఉగ్రవాదులను పంపేందుకు పాక్ చేసిన వ్యూహాలు విఫలమయ్యాయని చెప్పారు. ఉత్తర్ కశ్మీర్‌లోని గురుజ్ సెక్టార్ వద్ద భారత్ సేనలు చురుకుగా పని చేస్తున్నాయని... అందువల్ల పాక్ ఆటలు సాగలేదన్నారు.
పీఎంకేలో పాక్ అదనపు సైనిక బలగాలు ఉన్నాయి. అయితే చైనాకు మద్దతుగా వారు అక్కడ ఉన్నట్లు చెప్పలేమన్నారా అధికారి. భారత్‌ను దెబ్బతీసేందుకు పాక్ ప్రయత్నిస్తే... దీటుగా తిప్పికొట్టేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మిలటరీ క్యాంటీన్లో 'మేడ్ ఇన్ ఇండియా' అమలవుతోందా..?