ETV Bharat / bharat

'హైబ్రిడ్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'

ఇతర దేశాలతో హైబ్రిడ్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సాయుధ బలగాలకు సూచించారు వాయుసేన చీఫ్ భదౌరియా. ఎన్​డీఏ క్యాడెట్ల పాసింగ్ ఔట్​ పరేడ్​లో పాల్గొన్న ఆయన.. భౌగోళిక రాజకీయ అంశాలను అర్థం చేసుకోవాలన్నారు.

IAF chief
భదౌరియా
author img

By

Published : Nov 7, 2020, 12:31 PM IST

హైబ్రిడ్​ యుద్ధాలను ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని వాయుసేన అధిపతి ఆర్​కేఎస్ భదౌరియా అన్నారు. పుణెలో జరిగిన నేషనల్​ డిఫెన్స్​ అకాడెమీ క్యాడెట్ల పాసింగ్​ ఔట్ పరేడ్​లో పాల్గొన్న ఆయన.. వారిని ఉద్దేశించి మాట్లాడారు.

"ఎన్​డీఏ 139వ పరేడ్​లో పాల్గొనటం గౌరవంగా భావిస్తున్నా. బహుళ సరిహద్దుల్లో పొంచి ఉన్న 'హైబ్రిడ్ యుద్ధం' ముప్పును ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలి. అన్ని వేళలా వివేకం, అంకితభావం, నిబద్ధత, త్యాగం, నాయకత్వాన్ని ప్రదర్శించాలి. ఇదే మీ నుంచి దేశం కోరుకునేది. "

- ఆర్​కేఎస్ భదౌరియా, వాయుసేన చీఫ్

ప్రపంచంలోనే అత్యుత్తమ శిక్షణా సంస్థల్లో ఎన్​డీఏ ఒకటని కొనియాడారు భదౌరియా. వర్ధమాన సైనిక అధికారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ అంశాలు మన పరిసరాల్లోని భద్రతా వాతావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని మీరు అర్థం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: మరోసారి పాక్ దుర్నీతి.. జమ్ముకశ్మీర్​లో కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.