వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైన్యంతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర అవసరాలు తీర్చే విధంగా రూ. 300 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోళ్లు చేపట్టేందుకు త్రివిధ దళాలకు అధికారం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పరిమితి మేరకు ఇకపై కొనుగోళ్లకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెలుస్తోంది!
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రూ.300 కోట్ల వరకు ఎన్నైనా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని తెలిపింది. ఆయుధాల కొనుగోళ్లకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. ఉత్తర సరిహద్దులో తాజా పరిస్థితుల నేపథ్యంలో సాయుధ దళాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని డీఏసీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపింది.
-
The DAC delegated the powers for progressing urgent Capital Acquisition Cases upto Rs 300 crores to the Armed Forces to meet their emergent operational requirements.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) July 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The DAC delegated the powers for progressing urgent Capital Acquisition Cases upto Rs 300 crores to the Armed Forces to meet their emergent operational requirements.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) July 15, 2020The DAC delegated the powers for progressing urgent Capital Acquisition Cases upto Rs 300 crores to the Armed Forces to meet their emergent operational requirements.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) July 15, 2020
'అత్యవసర పనుల నిమిత్తం ఆయుధాలు కొనుగోలు చేసే అధికారాన్ని సైన్యానికి డీఏసీ బదిలీ చేసింది. పెట్టుబడి కోసం రూ.300 కోట్లు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఆయుధాల దిగుమతి కాలం ఏడాది కంటే తగ్గుతుంది' అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.
రాజ్‌నాథ్ లేహ్ పర్యటన
మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తూర్పు లద్దాఖ్‌లో పర్యటించనున్నారు. సరిహద్దులో మోహరించిన సైనికులతో సంభాషించి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించనున్నారు.
రాజ్‌నాథ్ సింగ్ జులై 17న దిల్లీ నుంచి నేరుగా లేహ్‌కు బయలుదేరనున్నట్లు అధికారులు వెల్లడించారు. గల్వాన్ ఘర్షణలో గాయపడిన సైనికులను పరామర్శించనున్నట్లు తెలిపారు. భద్రతా దళాలు మోహరించిన ఫార్వర్డ్ ప్రదేశాలను రాజ్‌నాథ్ సందర్శించనున్నారు. రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె సైతం లేహ్ పర్యటనలో పాల్గొననున్నారు.
ఇదీ చదవండి- బ్యాంక్ చోరీ- రూ.10లక్షలు కొట్టేసిన పదేళ్ల బాలుడు