ETV Bharat / bharat

'జల క్రాంతి'తో కరవు నేలలో జల సిరులు - EENADU SPECIAL STORY

బీటలు వారిన పంటభూములు.. ఎడారులను తలపించే చెరువులు.. తాగేందుకు చుక్క నీరు దొరక్క అల్లాడే ప్రజలు.. ఆత్మహత్య చేసుకునే అన్నదాతలు.. ఇదీ.. మహారాష్ట్రలో కరవు పీడిత విదర్భ ప్రాంతంలోని బుల్ఢాణా జిల్లాలో ఒకప్పటి పరిస్థితి! ఈ దుస్థితి నుంచి బుల్ఢాణా ఇప్పుడు పూర్తిగా బయటపడింది. ఏపుగా పెరిగిన పైరుతో పంట భూములు పచ్చని రంగేసుకున్నాయి. చెరువులు జల కళను సంతరించుకున్నాయి. పశుగణం బాగా పెరిగింది. రైతన్నల మోముల్లో చిరునవ్వులు దర్శనమిస్తున్నాయి. కారణం.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మానస పుత్రిక- 'జల క్రాంతి'.

Aquatic veins in famine
కరవు నేలలో జల సిరులు
author img

By

Published : Mar 2, 2020, 12:11 PM IST

Updated : Mar 3, 2020, 3:34 AM IST

కరవుతో బుల్ఢాణా జిల్లా దశాబ్దాలపాటు విలవిల్లాడింది. ఆర్థికంగా కుదేలైంది. కొన్ని గ్రామాల్లో నీటి కొరత ఎంత తీవ్రంగా ఉండేదంటే.. ఆ ఊళ్లలోని యువకులకు పిల్లనిచ్చేందుకూ ఎవరూ వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో జిల్లాకు ‘జల క్రాంతి’ వెలుగు రేఖగా మారింది.

2015 జూన్‌ 5న ‘జల క్రాంతి అభియాన్‌’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా బుల్ఢాణా జిల్లావ్యాప్తంగా చెరువుల్లో పూడిక తీశారు. దాదాపు 22 వేల బావులకు మళ్లీ ప్రాణం పోశారు. చెక్‌డ్యాములను నిర్మించారు. ఊట చెరువులు తవ్వించారు. ఈ ఊట చెరువులు కృత్రిమ రిజర్వాయర్లను తలపిస్తాయి. సింది హరాళి ప్రాంతం వద్ద ఊట చెరువు చుట్టూ గోధుమ, చెరకు, బార్లీ పంటలు దర్శనమిస్తుంటాయి.

మౌలిక వసతుల కల్పనలోనూ..

బుల్ఢాణాలో చేపట్టిన ‘జల క్రాంతి’ పనుల్లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కీలకంగా వ్యవహరించింది. జిల్లాలో మొత్తం 61 ఊట చెరువులను తవ్వగా.. అందులో 34 ఎన్‌హెచ్‌ఏఐ తవ్వించినవే. వాటితోపాటు చెరువులు, బావుల్లో పూడికతీతతో దాదాపు 52.10 లక్షల క్యూబిక్‌ మీటర్ల పరిమాణంలో మట్టి, కంకర లభ్యమయ్యాయి. వాటిని జాతీయ రహదారి-53 నిర్మాణ పనుల్లో సంస్థ ఉపయోగించుకుంది. దీంతో అటు జల సంరక్షణకు, ఇటు మౌలిక వసతుల కల్పనకు ఈ పథకం దోహదపడినట్లయింది.

మా ఊరికి ఐశ్వర్యమొచ్చింది

నీటి లభ్యత పెరిగి, పంటలు బాగా పండుతుండటంతో బుల్ఢాణా వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘నీరు తక్కువగా అవసరమయ్యే సోయాబీన్‌ పంటను కూడా మేం గతంలో పండించలేకపోయేవాళ్లం. తాగునీరు కావాలంటే ట్యాంకర్ల కోసం ఎదురుచేసేవాళ్లం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏటా రెండు పంటలు పండిస్తున్నాం. బావుల్లో నీటి లభ్యత బాగా పెరిగింది. చెరవులు నిండాయి’’ అని వివరించారు షెలూడ్‌ గ్రామానికి చెందిన 75 ఏళ్ల శ్రీపాద్‌ జాదవ్‌. ‘‘ఐశ్వర్యం మా ఊరిని చేరింది. ఈ పంటల్ని చూడండి’’ అని ఆనందం నిండిన కళ్లతో చెప్పారు బిమల్‌బాయ్‌ సుఖ్‌దేవ్‌.

Aquatic veins in famine
కరవు నేలలో జల సిరులు

కరవు కోరల్లో విదర్భ

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం పేరెత్తితే చాలు.. అన్నదాతల ఆత్మహత్యలే గుర్తొస్తాయి. ఇక్కడ వర్షపాతం తక్కువ. ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. వ్యవసాయ సంక్షోభంతో ఈ ప్రాంతం కొన్నేళ్లుగా కుదేలవుతోంది. 2018లో దేశవ్యాప్తంగా 5,763 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే.. అందులో 2,239 మంది విదర్భ ప్రాంతానికి చెందినవారే అంటే అక్కడి దైన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఆర్థికాభివృద్ధికి నిదర్శనం

Aquatic veins in famine
నితిన్‌ గడ్కరీ, కేంద్ర మంత్రి

మహారాష్ట్రలో అన్నదాతల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకున్న జిల్లాల్లో బుల్ఢాణా ఒకటి. అక్కడ భూగర్భ జలాల మట్టం 400 మీటర్ల దిగువకు పడిపోయింది. జల క్రాంతి ద్వారా చేపట్టిన పనులతో ప్రధానంగా బావుల్లో నీటి లభ్యత పెరిగింది. గతంలో ఇక్కడి బావుల్లో రోజుకు గంటపాటు కూడా పంపులు పనిచేసేవి కావు. ఇప్పుడు 12 గంటలపాటు నడుస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో వాహనాల సంఖ్య పెరగడం ఆర్థికాభివృద్ధికి నిదర్శనం.

- నితిన్‌ గడ్కరీ, కేంద్ర మంత్రి

చేకూరిన ప్రయోజనాలేంటి?

  • భూగర్భ జలాలు పెరిగాయి.
  • కేవలం బావుల్లో నీటి లభ్యత పెరగడం వల్లే 1,525 హెక్టార్ల సాగుభూమి అదనంగా అందుబాటులోకి వచ్చింది.
  • రైతులు ఏడాదికి 2 పంటలు పండించగలుగుతున్నారు.
  • పశుగణం పెరిగింది. పశు పోషణ చాలామందికి జీవనా ధారంగా మారింది.
  • చేపల పెంపకంతో పలువురు ఉపాధి పొందుతున్నారు.

Last Updated : Mar 3, 2020, 3:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.