ETV Bharat / bharat

"స్వేచ్ఛకు సంకెళ్లా?"

మీడియాపై అధికారిక రహస్యాల చట్టం కింద చర్యలు తీసుకుంటామన్న అటార్నీ జనరల్ హెచ్చరికను పాత్రికేయ లోకం తీవ్రంగా ఖండించింది. ఇది ప్రసార మాధ్యమాల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు భంగమని నిరసన వ్యక్తం చేసింది.

పత్రికా స్వేచ్ఛ
author img

By

Published : Mar 7, 2019, 4:31 PM IST

ప్రసార మాధ్యమాలపై 'అధికారిక రహస్యాల చట్టం' ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించడం నిందనీయమని ఎడిటర్స్​ గిల్డ్​ ఆక్షేపించింది. రఫేల్​ కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది.

రఫేల్​ వివాదంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున బుధవారం అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ వాదనలు వినిపించారు. రఫేల్ ఒప్పందంపై మీడియా ప్రచురించిన వార్తలకు ఆధారాలు చూపాలని కోరారు. రక్షణ మంత్రిత్వశాఖ నుంచి రహస్య పత్రాలు చోరీకి గురయ్యాయని, వాటిని దుర్వినియోగం చేసిన వారిపై అధికారిక రహస్యాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని మీడియాను ఉద్దేశించి అన్నారు.

ప్రభుత్వం మీడియా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను అణగదొక్కాలని చూస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని ఎడిటర్స్ గిల్డ్​ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ చర్యలపై నిరసన వ్యక్తం చేసింది. ప్రెస్​ క్లబ్​ ఆఫ్​ ఇండియా, ఇండియన్ ఉమెన్స్​ ప్రెస్​ కార్ప్స్​ అండ్ ప్రెస్​ అసోసియేషన్​ ఇదే తరహాలో కేంద్రంపై తీరును తప్పుబట్టాయి.

జర్నలిస్టులపై కాదులే...

ఈ వివాదంపై అటార్నీ జనరల్​ వివరణ ఇచ్చారు. అధికారిక రహస్య పత్రాలు ఉపయోగించిన పాత్రికేయులు, న్యాయవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేశారు.

Intro:Body:

a

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.