వెనక్కి తగ్గిన నిరసనకారులు...
ఈశాన్య దిల్లీ జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్, మౌజిపుర్ చౌక్ నుంచి నిరసనకారులు వెనుదిరిగారని స్పష్టం చేశారు దిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ సతీశ్ గోల్చా. ఇప్పుడు పరిస్థితులు అదుపులో ఉన్నాయని వెల్లడించారు.
01:43 February 26

00:02 February 26
National Security Advisor (NSA) Ajit Doval reviews the security situation in North-East Delhi. #DelhiViolence https://t.co/Nm146mT9da pic.twitter.com/Tdlo4WKESi
— ANI (@ANI) February 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">National Security Advisor (NSA) Ajit Doval reviews the security situation in North-East Delhi. #DelhiViolence https://t.co/Nm146mT9da pic.twitter.com/Tdlo4WKESi
— ANI (@ANI) February 25, 2020

పరిస్థితిని సమీక్షించిన అజిత్ డోభాల్
ఈశాన్య దిల్లీ సీలంపుర్లోని డీసీపీ కార్యాలయంలో.. రాజధాని భద్రతా పరిస్థితులపై సమీక్షించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. అనంతరం పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు వెళ్లారు.
21:58 February 25
కనిపిస్తే కాల్చివేత కొనసాగుతోంది
ఈశాన్య దిల్లీలో 'కనిపిస్తే కాల్చివేత' ఉత్తర్వులు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదేశాలు ఎత్తివేశారన్న వార్తలు అసంమజసమని పేర్కొన్నారు.
అశోక్ విహార్ ప్రాంతంలో ఓ మసీదు ధ్వంసమైందన్న వార్తలు కల్పితమని వాయువ్య దిల్లీ డీసీపీ స్పష్టం చేశారు. అశోక్ నగర్లో అలాంటి ఘటన జరగలేదని తెలిపారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేయవద్దని కోరారు.
21:22 February 25
13కు పెరిగిన మృతుల సంఖ్య
దిల్లీ నిరసనల్లో మృతుల సంఖ్య 13కు పెరిగింది. జాఫ్రాబాద్ రోడ్డు మార్గం నుంచి ఆందోళనకారులను చెదరగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈశాన్య దిల్లీలో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్- ఈశాన్య దిల్లీ రోడ్డు మార్గాన్ని బ్యారికేడ్లతో మూసేసినట్లు తెలిపారు.
అదే సమయంలో ఈశాన్య దిల్లీ ప్రాంతంలో రేపు కూడా పాఠశాలల బంద్ కొనసాగనున్నట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు.
19:35 February 25
చాంద్‌భాగ్‌లో నిరసనలు తీవ్రం
ఈశాన్య దిల్లీలోని చాంద్‌భాగ్ ప్రాంతంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపు దాల్చాయి. ఆందోళనకారులు వీధుల్లోని దుకాణాలు లక్ష్యంగా రాళ్లదాడికి దిగారు. ఓ బేకరీ, పండ్ల దుకాణాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎక్కడికక్కడ పారామిలిటరీ దళాలను మోహరించారు.
18:39 February 25
11 ఎఫ్ఐఆర్లు నమోదు..
ఈశాన్య దిల్లీలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ప్రకటించారు దిల్లీ పోలీసు అధికారులు. ఘర్షణలతో సంబంధమున్న 11 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అవసరమైన మేరకు సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించినట్లు ప్రకటించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, సీనియర్ పోలీసు అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
17:59 February 25
పదికి చేరిన 'పౌర' మృతులు
దిల్లీ పౌరవ్యతిరేక ఆందోళనల్లో మృతుల సంఖ్య పదికి చేరింది. 150మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
17:49 February 25
దిల్లీలో సీఏఏ వ్యతిరేక ఘర్షణలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఇప్పటివరకు 9మంది ప్రాణాలు కోల్పోయారు. 150మందికి పైగా గాయపడ్డారు.
రాళ్ల దాడులు....
మౌజ్‌పుర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కబీర్‌నగర్‌లో స్థానికులను బెదిరిస్తూ దుకాణాలపై రాళ్లు విసిరాయి అల్లరి మూకలు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. బాబర్‌పుర్, జాఫ్రాబాద్, ఖజూరీ ఖాస్ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని సమచారం. ముందు జాగ్రత్త చర్యగా పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు.
అల్లర్ల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఖజూరీ ఖాస్ ప్రాంతంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కవాతు నిర్వహించాయి. ఖజూరీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు అధికారులు.
అమిత్‌షా సమీక్ష
పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కాంగ్రెస్ నేత సుభాష్ చోప్రా తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు షా.
'సంయమనం పాటించండి'
దిల్లీలో జరుగుతున్ హింసాత్మక ఘర్షణలపై యావత్‌దేశం ఆందోళన చెందుతుందన్నారు ముఖ్యమంత్రి అరవంద్ కేజ్రీవాల్. జాతిపిత మహాత్ముడు చూపిన అహింసమార్గంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు కేజ్రీవాల్. మహాత్ముడి సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు.
హెడ్ కానిస్టేబుల్‌కు తుది వీడ్కోలు...
సోమవారం మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్ రతన్‌లాల్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నేడు పూర్తయ్యాయి. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు.
16:49 February 25
Delhi: Police and RAF are deployed in Khajuri Khaas, where violence and arson were reported yesterday. Section 144 has been imposed. pic.twitter.com/E25GgMILcv
— ANI (@ANI) February 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Delhi: Police and RAF are deployed in Khajuri Khaas, where violence and arson were reported yesterday. Section 144 has been imposed. pic.twitter.com/E25GgMILcv

సీఏఏ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఖజూరీ ఖాస్ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఖజూరీ ఖాస్‌లో సోమవారం ఘర్షణలు తీవ్రమయిన కారణంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు .
16:40 February 25
దిల్లీలో పౌరసెగలు కొనసాగుతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 9మంది మృతి చెందారు. ఈశాన్య దిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్పుర్లల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. అదే సమయంలో సోమవారం ఘర్షణల్లో ప్రాణాలు కోల్పయిన హెడ్ కానిస్టేబుల్ రతన్‌లాల్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నారు.
13:26 February 25
దిల్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తున్న వేళ మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈశాన్య దిల్లీలోని పలు ప్రాంతాల్లో తాజాగా ఘర్షణలు జరిగాయి. మౌజ్‌పుర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కబీర్‌నగర్‌లో స్థానికులను బెదిరిస్తూ దుకాణాలపై రాళ్లు విసిరాయి అల్లరిమూకలు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షిస్తున్నారు. దిల్లీ ప్రభుత్వంతో సహా అఖిల పక్ష భేటీని నిర్వహించారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కాంగ్రెస్ నేత సుభాష్ చోప్రా తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు షా.
దిల్లీలో శాంతి నెలకొనేలా అన్ని రాజకీయ పక్షాలు కృషి చేయాలని అమిత్ షా కోరినట్లు కేజ్రీవాల్ తెలిపారు.
అల్లర్లలో ఏడుగురు మృతి..
దిల్లీలో నిన్న జరిగిన పౌర చట్టం వ్యతిరేక అల్లర్లలో ఒక హెడ్‌కానిస్టేబుల్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 160 మందికిపైగా గాయపడ్డారు. అల్లర్లలో గాయపడిన షాదార డీసీపీ అమిత్ శర్మకు రాత్రి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు ప్రకటించారు.
భద్రత కట్టుదిట్టం..
ఇంకా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. దిల్లీ వీధుల్లో భారీ భద్రతా బలగాలను మోహరించారు. ఆయుధాలు, ప్రచార పత్రికలను పోలీసులు నిషేధించారు.
ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో జిల్లా మేజిస్ట్రేట్ సందర్శించి శాంతి సమావేశాలు ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు. వైద్య సదుపాయాలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. దిల్లీలో పోలీసుల కొరత ఉందన్నారు కేజ్రీవాల్.
సుప్రీం వద్దకు 'దిల్లీ అల్లర్లు'
ఈశాన్య దిల్లీ హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో ప్రస్తావించారు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్. శాంతి నెలకొల్పేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. షాహీన్‌బాగ్ ఆందోళనల పిటిషన్‌తో కలిపి రేపు విచారిస్తామని తెలిపింది.
12:24 February 25
సుప్రీం వద్దకు దిల్లీ అల్లర్లు
12:13 February 25
దిల్లీలో పోలీసుల కొరత!
దిల్లీలో పోలీసుల కొరత ఉన్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. హింసాత్మక పౌర నిరసనలపై అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. అల్లర్ల నేపథ్యంలో జిల్లా మెజిస్ట్రేన్ను అప్రమత్తం చేసినట్టు వెల్లడించారు. వైద్య సదుపాయాలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు కేజ్రీ.
11:58 February 25
మరోసారి ఉద్రిక్త వాతావరణం...
దిల్లీలో ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటిస్తుంటే.. మరోవైపు పౌర నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ఈశాన్య దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను మరువకముందే.. నేడు మౌజ్‌పుర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కబీర్ నగర్లో నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.