కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ పౌరచట్ట వ్యతిరేక సమావేశానికి హాజరయ్యారు చిదంబరం. అయితే వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డు ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఫ్లెక్సీ బోర్డు కూలిన సమయంలో సభలో చిదంబరం ప్రసంగిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అయితే నిర్వాహకులు వేగంగా స్పందించి ఫ్లెక్సీ బోర్డు సరిచేశారని.. చిదంబరం తన ప్రసంగాన్ని కొనసాగించారని సమాచారం.
ఇదీ చూడండి: పీజీ పట్టభద్రుడి భిక్షాటన.. ఎందుకో తెలుసా?