ETV Bharat / bharat

​​​​​​​'నిర్భయ'కు సత్వర న్యాయం కోసం హజారే మౌనవ్రతం - ​​​​​​​'నిర్భయ'కు సత్వర న్యాయం కోసం హజారే మౌనవ్రతం

నిర్భయ కేసులో సత్వర న్యాయం జరగాలని డిమాండ్​ చేస్తూ వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు అన్నా హజారే. మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామంలో మౌనవ్రతం చేపట్టారు. ప్రభుత్వాలు స్పందించకపోతే నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు హజారే.

anna Hazare begins 'maun vrat' for speedy justice in Nirbhaya case
​​​​​​​'నిర్భయ'కు సత్వర న్యాయం కోసం హజారే మౌనవ్రతం
author img

By

Published : Dec 20, 2019, 5:33 PM IST

Updated : Dec 20, 2019, 6:55 PM IST

​​​​​​​'నిర్భయ'కు సత్వర న్యాయం కోసం హజారే మౌనవ్రతం

నిర్భయకు త్వరగా న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ.. మౌనవ్రతంతో నిరసనకు దిగారు గాంధేయవాది, ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే. మహారాష్ట్ర అహ్మద్​నగర్​లోని ఆయన స్వగ్రామం రాలెగన్​ సిద్ధిలో పోరాటాన్ని ప్రారంభించారు. .

దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వాలు, కోర్టులు సత్వర న్యాయం ఎందుకు అందించలేకపోతున్నాయని ఆయన ప్రశ్నించారు. నిర్భయ నిందితులను శిక్షించే వరకు తాను మౌనవ్రతంలోనే ఉంటానన్నారు. ఈ విషయమై డిసెంబర్​ 9న నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మౌనవ్రతానికి ప్రభుత్వం స్పందించకపోతే, నిరాహార దీక్షకూ సిద్ధమేనని ఆయన తెలిపారు.

'దేశ రాజధాని దిల్లీ సహా దేశవ్యాప్తంగా మహిళలపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్​ దిశ కేసులో నిందితులను ఎన్​కౌంటర్ చేస్తే యావత్​ దేశం హర్షం వ్యక్తం చేసింది. ఇందుకు న్యాయవ్యవస్థలో జరిగే ఆలస్యం, పోలీసు పక్రియలోని జాప్యాలే కారణం.'
-అన్నా హజారే, సామాజిక ఉద్యమకారుడు

ఈ సందర్భంగా ఆయన 'న్యాయపరమైన జవాబుదారీతన' బిల్లును పార్లమెంటు ఆమోదించాలని, ఖాళీగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థానాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. పోలీసు బలగాలను పెంచాలని కోరారు.

ఇదీ చదవండి:మహిళ నోట్లో నుంచి వెంట్రుకలు, మట్టి పెళ్లలు..?

New Delhi, Dec 20 (ANI): Expelled BJP MLA Kuldeep Singh Sengar was awarded life imprisonment by Delhi's Tis Hazari Court in the 2017 Unnao rape case. The court ordered Kuldeep Sengar to pay a compensation of Rs. 25 lakh to the victim. The Court also directed CBI to assess threat perception and offer the necessary protection to the victim and her family.

Last Updated : Dec 20, 2019, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.