ఉత్తర్‌ప్రదేశ్ రాయబరేలీలో సౌకర్యాలు లేవని ఆగ్రహించి విద్యార్థులు... బాలల పరిరక్షణ కమిషన్ (చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ )సభ్యురాలి ముందే వసతి గృహంలో విధ్వంసం సృష్టించి నిరసన తెలిపారు.
చక్ దౌహ్రాలోని ఈ బాలల వసతి గృహం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అక్కడి పిల్లలు వార్డెన్‌ను కొట్టడం, మరి కొన్నిసార్లు ఉపాధ్యాయులు విచక్షణా రహితంగా పిల్లలను కొట్టడం వంటి ఘటనలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి.
ఈ విషయమై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర బాలల సంరక్షణ కమిషన్ సభ్యురాలు సుచిత తివారీ వసతి గృహానికి చేరుకున్నారు. అకస్మాత్తుగా వసతి గృహం గందరగోళంగా మారింది. విద్యార్థులు హాస్టల్లోని వస్తువులను ధ్వంసం చేయడం ప్రారంభించారు. సరైన సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. విద్యార్థులకు.. పోలీసులు నచ్చచెప్పి శాంతింపజేశారు.
ఇదీ చదవండి:ఎటు చూసినా కవలలు.. అయోమయంలో టీచర్లు!