ETV Bharat / bharat

రోడ్డు దాటుతూ.. రెండు కాళ్లూ కోల్పోయిన వృద్ధురాలు!

చెన్నైలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించి ఓ వృద్ధురాలు రెండు కాళ్లూ పోగొట్టుకుంది. సిగ్నల్​ దగ్గర బస్సు చక్రాల కింద పడిపోయిన ఆమెను స్థానికులు కాపాడారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్​ అయ్యాయి.

రోడ్డు దాటబోయి రెండు కాళ్లూ కోల్పోయిన వృద్ధురాలు!
author img

By

Published : Aug 11, 2019, 11:26 AM IST

Updated : Sep 26, 2019, 3:59 PM IST

రోడ్డు దాటబోయి రెండు కాళ్లూ కోల్పోయిన వృద్ధురాలు
తమిళనాడు చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ బస్సు వృద్ధురాలిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లూ పొగొట్టుకుంది.

చెన్నై పురసాయివక్కంలో ట్రాఫిక్​ సిగ్నల్ దగ్గర ఈ ఘటన జరిగింది. రెడ్​ సిగ్నల్​ పడిన సమయంలో వాహనాలన్నీ కాసేపు రోడ్డుపై ఆగాయి.​ జీబ్రా క్రాసింగ్​ పద్దతిని పాటించని వృద్ధురాలు బస్సు ముందు నుంచి రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఎత్తులో ఉన్నందున బస్సు డ్రైవర్​కు మహిళ కనబడలేదు. గ్రీన్​ సిగ్నల్​ పడగానే బస్సును ముందుకు కదిపాడు. బస్సు తాకిడికి చక్రాల కింద పడిపోయిందామె. ఈ సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె రెండు కాళ్లూ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:డోభాల్​ను ప్రశ్నించిన కశ్మీర్​ గొర్రెల కాపరి

Port of Spain (Trinidad and Tobago), Aug 11 (ANI): Ahead of the second ODI against India, West Indies skipper Jason Holder said executing plans in a proper manner is the key to winning games in cricket. While speaking to mediapersons, he said, "We got plans for everybody, we just got to execute. I think execution is the key part of winning cricket games. We got to be consistent in all three departments." The first ODI was abandoned due to rain. West Indies will face India for the second ODI on Sunday.

Last Updated : Sep 26, 2019, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.