ETV Bharat / bharat

అబ్బాయిగా ఇమడలేక.. దీపికగా మారిన దీపక్​ - మార్వాడీ డాన్సర్ దీపక్​

లింగమార్పిడి అనగానే చిన్నచూపు చూసేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెక్నాలజీ వల్లనో, మాధ్యమాల వల్లనో దానిపట్లు సమాజం చూసే కోణంలో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో తమకు నచ్చినట్లు జీవించాలనుకునే వారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలా అబ్బాయిగా ఇమడలేక శస్త్రచికిత్స చేయించుకుని దీపికగా మారాడు దీపక్​. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోన్న దీపికపై ప్రత్యేక కథనం..

An inspiration story about Deepika to those who thought that they are born with different
దీపికగా మారిన దీపక్​
author img

By

Published : Sep 5, 2020, 2:56 PM IST

Updated : Sep 5, 2020, 5:20 PM IST

దీపికగా మారిన దీపక్​

లింగమార్పిడి గురించి బహిరంగంగా మాట్లాడే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. తమ శరీరం నచ్చని ఏ అమ్మాయైనా, అబ్బాయైనా.. లింగమార్పిడి చేయించుకునే అవకాశాలూ ఇప్పుడు విరివిగానే ఉన్నాయి. కానీ ఒకప్పుడు దానిగురించి నోరు తెరిచి మాట్లాడటమే పెద్ద తప్పులా భావించేవారు. లింగమార్పిడి చేయించుకున్న వారికి సమాజంలో గౌరవం దక్కకపోవడమే కాకుండా.. శస్త్రచికిత్స తర్వాత మానసిక, శారీరక హింసకు గురయ్యేవారు. కాలంతో పాటు పరిస్థితుల్లోనూ మార్పు వచ్చింది. దీన్ని ప్రస్తుతం నిషేధిత చర్యగానూ ప్రజలు చూడట్లేదు.

అనంద జీవనం వచ్చిందిలా..

లింగమార్పిడిని శాస్త్రీయ భాషలో జెండర్ డిస్ఫోరియా అంటారు. ఈ పదం ఇటీవల జోధ్​పుర్​లో చర్చనీయాంశమైంది. ఈ ప్రాంతానికి చెందిన ఓ నృత్యకారుడు దీపక్.. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకుని, దీపికగా మార్పుచెందాడు. 3 నెలల క్రితం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుంది దీపిక. శస్త్రచికిత్స అనంతరం కొత్త దేహంతో చాలా ఆనందంగా జీవనం సాగిస్తోంది. చిన్నప్పటి నుంచీ ఆడపిల్లల దుస్తులు ధరించి, డ్యాన్స్ చేసేవాడినని చెప్తున్నాడు దీపక్. అమ్మాయిలతోనే సరదాగా గడిపేందుకు ఇష్టపడే దీపక్​.. అబ్బాయిల సహవాసంలో తెగ ఇబ్బంది ఎదుర్కొనేవాడట.

బాలీవుడ్​ డ్యాన్సర్​ కావాలని..

"చిన్నప్పుడు అమ్మాయిల బట్టలు వేసుకుని డాన్స్ చేసేదాన్ని. నేను అమ్మాయినే అన్న భావన ఉండేది నాలో. డాన్సర్ అవ్వాలని నా కోరిక."

- దీపిక, మార్వాడీ డాన్సర్

పదేళ్లుగా జోధ్​పుర్​ పరిసర ప్రాంతాల్లో మార్వాడీ పాటలకు నాట్యం చేస్తోంది దీపిక. డాన్స్​ రంగంలో బాలీవుడ్​లో రాణించాలని కలలు కంటోంది.

డాన్స్​పై అభిరుచి పెరిగందలా..

"ముందు నాపేరు దీపక్​గా ఉండేది. ఆ పేరుతోనే జోధ్​పుర్​లో నేను అందరికీ పరిచయం. ఇప్పుడు డాన్సర్ దీపిక పేరుతో గుర్తింపు పొందాలనుకుంటున్నాను. దేవుడి దయతో బాలీవుడ్​లోకి వెళ్లాలనుంది. అందుకోసం బాగా కష్టపడుతున్నాను."

- దీపిక

తండ్రి ఆకస్మిక మరణం తర్వాత.. దీపిక కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఆ పరిస్థితుల్లో చిన్నచిన్న కార్యక్రమాల్లో ప్రదర్శనలివ్వగా వచ్చిన డబ్బుతో.. ఇంటిని నెట్టుకొచ్చింది దీపిక. క్రమంగా డాన్స్​పై ఇష్టం పెరిగి, అదే అభిరుచిగా మారింది.

కుటుంబ సభ్యుల మద్దుతుతో..

"ఇది నా జీవితం, నాకు నచ్చిన పని నేను చేస్తా. జనం కామెంట్లు చేస్తూనే ఉంటారు. నా గురించి, నా కుటుంబం గురించి ఆలోచించుకోవాలి."

- దీపిక

తాను తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబసభ్యులు మనస్ఫూర్తిగా అంగీకరించారని చెప్తోంది దీపిక. దీపిక తల్లిదండ్రులు ఆమెకు నచ్చిన పని చేయడంలో పూర్తి సహకారం అందించారు. లింగ మార్పిడి విషయంలోనూ ఆమెకు మద్దతుగా నిలబడ్డారు.

"మా అమ్మ, నా కుటుంబం నాకు మద్దతుగా నిలిచారు. ఇందుకు నేను దేవుడికి కృతజ్ఞురాలిని. నన్ను నాలా స్వీకరించే కుటుంబం ఉన్నందుకు ధన్యురాలిని."

- దీపిక

ఎంతో మందికి ఆదర్శం..

తాము వేరే శరీరంతో పుట్టామని భావించే ఓ దీపిక కథ ఇది. ఆమె ధైర్యం చేసి, తనకు నచ్చినట్లు మారగలిగింది. కానీ.. అసంతృప్తితో, యాంత్రికంగా బతుకును సాగించే ఇలాంటి దీపక్​లు, దీపికలు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ప్రజల్లో లింగమార్పిడిపై సరైన అవగాహన ఉంటే.. అలాంటి ఎంతోమంది శస్త్రచికిత్స తర్వాత, ఆనందకరమైన జీవితం గడిపే అవకాశాన్ని ప్రసాదించవచ్చు.

ఇదీ చదవండి: అగ్గితో అద్భుత నైపుణ్యం.. ఆ కళకే ప్రపంచ రికార్డ్​

Last Updated : Sep 5, 2020, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.