ETV Bharat / bharat

చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వానరం

గాయపడిన ఓ కోతి చికిత్స చేయించుకోవటానికి నర్సింగ్​ హోంకు వచ్చిన ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా డాండేలీలో జరిగింది. ముందు కోతిని చూసి భయపడిన సిబ్బంది.. ఆ తర్వాత గాయపడినట్లు గుర్తించి చికిత్స చేశారు. అనంతరం ఆ కోతి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

An injured monkey comes to the clinic, gets treatment... Video goes viral
చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వానరం
author img

By

Published : Jun 7, 2020, 12:44 PM IST

మనకు జ్వరం, తలనొప్పి, ఇతరత్రా సమస్యలు వస్తే ఆసుపత్రికి వెళ్తుంటాము. మన బంధువులకు అకస్మాత్తుగా ప్రమాదం జరిగినా అంబులెన్స్​ ద్వారా వారిని ఆసుపత్రికి తరలిస్తాము. ఇది సర్వసాధారణం. కానీ ఓ కోతి తనకు గాయం అయిందంటూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది.

చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వానరం

శనివారం డాండేలీలోని ఓ నర్సింగ్​ హోం గడప వద్దకు ఓ కోతి వచ్చి కూర్చుంది. మొదట వానరాన్ని చూసిన సిబ్బంది భయపడి దాన్ని తరిమేందుకు ప్రయత్నించారు. కానీ అది ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఆ గడప వద్దే దీనంగా కూర్చుంది. కొంత సమయం తర్వాత కోతికి గాయమైందని గమనించిన సిబ్బంది దానికి చికిత్స చేశారు.

అనంతరం ఆ కోతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి: శాంతి మంత్రానికే భారత్​- చైనా మొగ్గు: ఎంఈఏ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.