ETV Bharat / bharat

గుజరాత్​లో మళ్లీ భూకంపం- 24 గంటల్లో రెండోది - గుజరాత్​లో రెండోసారి భూకంపం

గుజరాత్​లో గడిచిన 24 గంటల్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 4.4 తీవ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

GUJARATH EARTHQUAKE
గుజరాత్​లో మళ్లీ భూకంపం
author img

By

Published : Jun 15, 2020, 2:30 PM IST

ఉత్తర భారతంలో వరుసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. తాజాగా గుజరాత్​ రాజ్​కోట్​లో 4.4 తీవ్రతతో మధ్యాహ్నం 12.57 గంటలకు భూకంపం సంభవించిందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్​సీఎస్​) ప్రకటించింది.

రాజ్​కోట్​కు వాయువ్య దిశలో 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్​సీఎస్ తెలిపింది.

24 గంటల్లోనే..

గడిచిన 24 గంటల్లో గుజరాత్​లో సంభవించిన రెండో భూకంపం ఇది. శనివారం రాత్రి 8.13 గంటలకు 5.5 తీవ్రతతో భూమి కంపించటం వల్ల కచ్​, రాజ్​కోట్​, అహ్మదాబాద్​, పటాన్​ నగరాల్లోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప కేంద్రం కచ్​ జిల్లా భచావులో నమోదైనట్లు అధికారులు తెలిపారు.

దిల్లీలోనూ..

వారం రోజుల కిందట దేశ రాజధానిలోనూ భూమి కంపించింది. ఏప్రిల్​ నుంచి ఇప్పటివరకు దిల్లీలో 14 సార్లు తక్కువ స్థాయి తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.

ఇదీ చూడండి: గుజరాత్​లో భూకంపం- రిక్టర్​ స్కేల్​పై 5.5 తీవ్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.