ETV Bharat / bharat

అంగన్​వాడీ కేంద్రం నిర్మాణానికి 'ప్లాస్టిక్​ ఇటుకలు' - Barak valley latest

ప్లాస్టిక్​ వ్యర్థాలతో వినూత్న కార్యక్రమం చేపట్టారు అసోం అధికారులు. వాడిపారేసిన నీటి సీసాలతో అంగన్​వాడీ కేంద్రాన్ని నిర్మిస్తూ చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు.

A house made of no bricks, but plastic in Assam
ఆ అంగన్​వాడీ కేంద్రం నిర్మాణానికి 'ప్లాస్టిక్​ ఇటుకలు'
author img

By

Published : Oct 9, 2020, 8:11 PM IST

ప్లాస్టిక్​ వినియోగం ఎంత ప్రమాదకరమో మానవాళికి తెలుసు. అయినా సరే.. వాటిని ఉపయోగించడం మాత్రం మానరు. మానవ జాతికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్​ను నిషేధించాలంటూ ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. అసోంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. వాడి పారేసిన నీళ్ల సీసాలను ఉపయోగించి.. ఏకంగా అంగన్​వాడీ కేంద్రాన్నే నిర్మిస్తున్నారు.

A house made of no bricks, but plastic in Assam
ప్లాస్టిక్​తో భవన నిర్మాణం

ప్లాస్టిక్​ ఇటుకలుగా మార్చి..

హైలాకాండీ నగరంలోని బరాక్​ లోయలో ఓ అంగన్​వాడీ కేంద్రాన్ని వినూత్న రీతిలో ఏర్పాటు చేయిస్తోంది జిల్లా యంత్రాంగం. వాడిపారేసిన ప్లాస్టిక్​ సీసాలలో మట్టిని నింపి.. వాటిని ఇటుకలుగా ఉపయోగిస్తున్నారు. సాధారణ భవన నిర్మాణం లాగే.. తొలుత సిమెంట్​, కంకరతో కూడిన పిల్లర్​ను నిర్మించి.. గోడ కట్టడంలో ప్లాస్టిక్​ బాటిళ్లను పేర్చుతున్నారు. మధ్య మధ్యలో మామూలుగానే సిమెంట్​ వినియోగిస్తూ నిర్మిస్తోన్న ఈ ప్లాస్టిక్​ సీసాల గోడలు చూడటానికి భలే అందంగా కనిపిస్తున్నాయి.

వ్యర్థ సీసాలతో నిర్మించిన గోడలు

ఇదీ చదవండి: ఉపాధి కోసం 60 ఏళ్ల మహిళల 'సాగర సాహసాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.