ETV Bharat / bharat

బలహీనపడుతున్న అంపన్​.. 'ఆరెంజ్'​ హెచ్చరిక జారీ

'అంపన్' సూపర్ సైక్లోన్​ ఇవాళ సాయంత్రం నాటికి బలహీన పడి అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నాటికి బంగాల్- బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనుందని పేర్కొంది. బంగాల్, ఒడిశా​ తీర ప్రాంతాల్లోని నగరాలపై ప్రభావం ఉండనుందని హెచ్చరించింది.

Digha beach became desolate on cyclone Amphan alertness
బలహీనపడుతున్న అంపన్​.. తీవ్ర తుపానుగా మారే అవకాశం
author img

By

Published : May 19, 2020, 11:31 AM IST

Updated : May 19, 2020, 12:06 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన సూపర్​ సైక్లోన్​ అంపన్ మంగళవారం మధ్యాహ్నం నాటికి బలహీనపడి 'అత్యంత తీవ్ర తుపాను'గా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం బంగాల్​లోని దిఘాకు 670 కి.మీ దూరంలో ఉన్న ఈ అంపన్​ తుపాను.. బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం నాటికి బంగాల్​- బంగ్లాదేశ్ తీరాలను దాటే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆ సమయంలో 165 నుంచి 185 కి.మీ వేగంతో గాలులువీస్తాయని, తీవ్రమైన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ప్రస్తుతం 240 నుంచి 250 కి.మీ వేగంతో వస్తున్న ఈ భీకర తుపాను... ఇవాళ సాయంత్రానికి 200 నుంచి 230 కి.మీ వేగానికి పడిపోతుందని వాతావరణ శాఖ చెప్పింది.

'ఆరెంజ్' హెచ్చరిక

అంపన్ తుపాను నేపథ్యంలో భారత వాతావరణశాఖ బంగాల్​కు 'ఆరెంజ్​' హెచ్చరిక జారీ చేసింది. కోల్​కతా, హూగ్లీ, హవ్​డా, దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, తూర్పు మిడ్నాపుర్​ జిల్లాల్లో భారీగా నష్టం సంభవించే అవకాశముందని హెచ్చరించింది. ఒడిశా తీరప్రాంతాలపైనా అత్యంత ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

అమిత్​ షా సంప్రదింపులు...

అంపన్​ తుపానుపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​తో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చర్చించారు. కేంద్రం తరఫున పూర్తిగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: అశ్వగంధతో కరోనాకు ఔషధం!

Last Updated : May 19, 2020, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.