లాక్డౌన్ కారణంగా ముంబయిలో చిక్కుకుపోయిన వలస కూలీలను ప్రత్యేక విమానంలో వారి సొంత రాష్ట్రానికి తరలించి.. మరోసారి ఉదారతను చాటుకున్నారు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. ఈ ఉదయం ముంబయి నుంచి సుమారు 180 మంది వలస కూలీలతో బయల్దేరిన ప్రత్యేక విమానం లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. వీరంతా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్, గోండా, లఖ్‌నవూకు చెందినవారని చెప్పారు.
మహారాష్ట్రలో చిక్కుకుపోయిన దాదాపు 700 మంది వలస కూలీలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు తరలించేందుకు అమితాబ్ మూడు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. ఇవి ముంబయి నుంచి అలహాబాద్, గోరఖ్‌పుర్, వారణాసికి కూలీలను తరలించనున్నాయి. వలస కార్మికుల తరలింపు ప్రక్రియను అమితాబ్ సన్నిహితుడు రాజీవ్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. సొంతఊళ్లకు చేరుకున్న వలసకూలీలు.. బిగ్‌బీకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: అత్త మీద కోపంతో కన్నబిడ్డను పొడిచి చంపిన తల్లి!