దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ కట్టడిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. భాజపా,కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ పార్టీలకు ఈ మేరకు ఆహ్వానం అందింది. ఈ భేటీలో దిల్లీలోని ప్రస్తుత పరిస్థితులు, కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై చర్చించనున్నారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు.
దిల్లీలో వైరస్ కట్టడిపై చర్చించేందుకు దిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజల్,సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష జరిపిన అమిత్ షా టెస్ట్‌ల సంఖ్యను రెట్టింపుచేస్తామని వెల్లడించారు.
కరోనా పరీక్షలు, చికిత్సల రేట్లను ఖరారు చేసేందుకు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకల లభ్యతను పరిశీలించేందుకు ఏర్పాటుచేసిన వీకే పాల్ నేతృత్వంలోని కమిటీ కేంద్ర హోంమంత్రికి ఇవాళ నివేదిక సమర్పించనుంది.
వైరస్‌పై సమైక్య పోరాటం..
ప్రస్తుత వైరస్ సంక్షోభ పరిస్థతుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మునిసిపల్ కార్పొరేషన్లు కలిసి సమర్థంగా పోరాడనున్నట్లు చెప్పారు తూర్పు దిల్లీ నగర మేయర్ అంజు కమల్‌కాంత్ తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆదివారం కేంద్ర హోంమంత్రితో సమావేశమైన అనంతరం చెప్పారు.
ఇదీ చూడండి: కరోనా పంజా: నవంబరులో అత్యంత దారుణ స్థితి!