ETV Bharat / bharat

బంగాల్​పై భాజపా గురి.. రంగంలోకి 'అమిత్​ షా'..! - బంగాల్​ భాజపా

బంగాల్​లో పాగా వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ. రానున్న 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్​ కాంగ్రెస్​ను గద్దె దించేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం పార్టీ అగ్రనాయకత్వమే రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాల్​ ఎన్నికల బాధ్యతలను కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేపడతారని పార్టీ వర్గాల సమాచారం.

Amit Shah
అమిత్​ షాకు బంగాల్​ ఎన్నికల బాధ్యతలు
author img

By

Published : Oct 4, 2020, 9:06 AM IST

ఓ వైపు బిహార్​ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతూనే.. బంగాల్​లో పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది భారతీయ జనతా పార్టీ. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్​ కాంగ్రెస్​ను.. కూకటి వేళ్లతో పెకిలించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగానే బంగాల్​ ఎన్నికల బాధ్యతలను కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేపడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బంగాల్​ ఎన్నికలను భాజపా సెంటిమెంట్​ అంశంగా భావిస్తోందని తెలిపాయి.

"బంగాల్​లో భాజపా కార్యకర్తలపై దాడులు జరిగిన క్రమంలో.. దుర్గ పూజ సందర్భంగా రాష్ట్రంలో పర్యటించి అందరితో సమావేశమవుతానని భరోసా కల్పించారు అమిత్​ షా. పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు, ఎమ్మెల్యేలతో సమావేశంపై తన ప్రణాళికను పంచుకున్నారు. బంగాల్​లో షా పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ ప్రణాళిక చేస్తోంది. కానీ, ప్రస్తుత కరోనా సమయంలో అది సవాలుతో కూడుకున్న పనిగా భావిస్తున్నారు నేతలు. దుర్గ పూజ సందర్భంగా పంచమి నుంచి అష్టమి సమయంలో అమిత్​ షా బంగాల్​ పర్యటన ఉండనుంది."

- భాజపా వర్గాలు

క్షేత్రస్థాయి కార్యకర్తలతో వర్చువల్​ ర్యాలీతోనే.. బంగాల్​ ఎన్నికల కోసం కాషాయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు రాష్ట్ర భాజపా ఎంపీ అర్జున్​ సింగ్​. టీఎంసీ పార్టీ నాయకులు, బంధువులకు ప్రయోజనం చేకూర్చేందుకు అనేక కుంభకోణాలకు పాల్పడిన అధికార ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు భాజపా తన వంతు కృషి చేస్తుందని పేర్కొన్నారు సింగ్​.

ఇదీ చూడండి: బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.