తాను పోటీ చేస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో నేడు ప్రచారం చేయనున్నారు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా. రెండు రోడ్‌షోలతో ప్రచార శంఖారావం పూరించనున్నారు.
పశ్చిమ అహ్మదాబాద్ నగరంలో ఈ రోడ్‌షోలు జరగనున్నాయి. గాంధీనగర్ లోక్‌సభ పరిధిలోనే ఉంది అహ్మదాబాద్.
ఆహ్మదాబాద్ శివారులోని సర్కేజ్లో మొదటి రోడ్‌షో ప్రారంభం అవుతుంది. ఇది వస్త్రపూర్‌లోని హవేలీ వద్ద ముగుస్తుంది. రెండో రోడ్‌షో సబర్మతి ప్రాంతంలో సాయంత్రం జరగనుంది.
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నేడు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆనంద్, వడోదరా, అహ్మదాబాద్‌లో జరిగే సభల్లో ఆమె ప్రసంగిస్తారని భాజపా గుజరాత్ అధ్యక్షుడు జితు వఘాని తెలిపారు.