ETV Bharat / bharat

బిహార్​లో సీట్ల కేటాయింపుపై కొలిక్కిరాని స్పష్టత!

author img

By

Published : Oct 2, 2020, 4:47 AM IST

బిహార్​ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి పార్టీ సీట్ల కేటాయింపుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎల్​జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌తో గురువారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల కేటాయింపు అంశంలో తుది నిర్ణయానికి రాలేదు.

Amit shah meeting with Chirag pasawan
అమిత్​ షాను కలిసిన చిరాగ్​- కొలిక్కిరాని సీట్ల కేటాయింపు!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు సీట్ల కేటాయింపు అంశంపై ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎల్​జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌తో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిరాగ్‌.. బిహార్‌ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌తో తనకు ఉన్న సమస్యను వారి ముందు ఉంచినట్టు సమాచారం. రాష్ట్రంలో 143 స్థానాల నుంచి పోటీ చేయాలంటూ తమ పార్టీ నుంచి ఒత్తిడి ఉందని కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ భేటీలో ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల కేటాయింపు అంశంలో ఎలాంటి తుది నిర్ణయానికీ రాలేదు. భాజపాతో తమకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చిరాగ్‌ పేర్కొన్నారు.

శని, ఆదివారాల్లో అభ్యర్థుల జాబితా!

రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గురువారం నుంచే తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో శని, లేదా ఆదివారాల్లో అభ్యర్థుల జాబితాను భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సిద్ధంచేసే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా ఒకట్రెండు రోజుల్లో సీట్ల కేటాయింపు అంశం తేలిపోతుందన్న విశ్వాసంతో ఉన్నాయి. అయితే, సీట్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగితే మాత్రం 143 స్థానాల్లో పోటీ చేస్తామని చిరాగ్‌ ఈ సందర్భంగా సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. భాజపా పోటీ చేసే స్థానాల్లో మాత్రం ఎల్​జేపీ బరిలో ఉండదని ఇప్పటికే చిరాగ్ పాసవాన్‌ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బిహార్ బరి: నేరచరితుల భార్యలదే హవా!

విపక్షాల్లోనూ భేదాభిప్రాయాలు..

కాంగ్రెస్​-ఆర్​జేడీ మధ్య కూడా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. కాంగ్రెస్​.. ఆర్​జేడీకి 75 సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై లాలూ పార్టీ సుముఖంగా లేదు. మరోవైపు.. ఆర్​జేడీనే కాంగ్రెస్​కు 58 స్థానాల్లో పోటీచేసేందుకు అవకాశమివ్వనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల ముందు విపక్షాల కూటమిలో భేదాభిప్రాయాలు సమసిపోతాయో లేదో వేచిచూడాలి.

గురువారం సమావేశమైన బిహార్​ కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ.. ఈ ఎన్నికల్లో ఏడుగురు సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.