ETV Bharat / bharat

గిరిరాజ్​ను మందలించిన హోంమంత్రి అమిత్​ షా - గిరిరాజ్​ సింగ్

ఎన్డీఏ నేతల ఇఫ్తార్​ విందుపై కేంద్రమంత్రి గిరిరాజ్​ సింగ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు హోం మంత్రి అమిత్​ షా. వివాదస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలంటూ ఆయనను మందలించారు.

గిరిరాజ్​ను మందలించిన హోంమంత్రి అమిత్​ షా
author img

By

Published : Jun 5, 2019, 12:06 AM IST

ఎన్డీఏ నేతల ఇఫ్తార్ విందులపై కేంద్రమంత్రి గిరిరాజ్​ సింగ్ ట్విట్టర్​లో చేసిన వ్యాఖ్యలపై భాజపా అధ్యక్షుడు అమిత్​షా ఆగ్రహించారు. వివాదస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మందలించారు. ఎన్డీఏ నేతలు నితీశ్ కుమార్, రామ్ విలాస్ పాసవాన్ ఇఫ్తార్ విందులో పాల్గొంటున్న చిత్రాలను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు గిరిరాజ్.

giriraj
గిరిరాజ్ ట్వీట్

'ఇంతే ఆసక్తితో నవరాత్రి ఉత్సవాల్లో ఫలహారం స్వీకరిస్తే ఎంత చక్కటి చిత్రాలు వస్తాయి... మన ధర్మాలను పాటించేందుకు విముఖత వ్యక్తం చేసి, ఇతరులకు కనిపించటానికి ఎందుకు ముందుంటాం' అని తన ట్వీట్​లో ప్రశ్నించారు.

బిహార్​లో నితీశ్​కుమార్​ ప్రభుత్వంలో పనిచేసినప్పటి నుంచి ఆయనను వ్యతిరేకిస్తూ వస్తున్నారు గిరిరాజ్. తాను పోస్ట్ చేసిన నాలుగు ఫోటోల్లోనూ నితీశ్​ ఉండటం చర్చనీయాంశంగా మారింది. గిరిరాజ్​ పోస్ట్ చేసిన చిత్రాల్లో భాజపా నేత, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్​ మోదీ సైతం కనిపిస్తున్నారు.

giri
ట్విట్టర్​లో గిరిరాజ్ పోస్ట్ చేసిన ఓ చిత్రం

గిరిరాజ్ ట్వీట్​కు ఎల్​జేపీ నేత చిరాగ్ పాసవాన్ స్పందించారు. భారతీయ సంప్రదాయాలను గిరిరాజ్ ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

"సబ్​కా సాథ్, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్ "మోదీ నినాదమని చిరాగ్ గుర్తు చేశారు.

నితీశ్​కుమార్ కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో భాజపా ఇవ్వజూపిన ఒక మంత్రి పదవిని తిరస్కరించారు. బిహార్ తాజా మంత్రివర్గ విస్తరణలో ఎనిమిది మందికి మంత్రి పదవులు దక్కాయి. భాజపాకు నితీశ్ మంత్రివర్గంలో చోటుదక్కలేదు.

ఈ పరిణామాలు కొనసాగుతుండగానే గిరిరాజ్ రెండు పార్టీల మధ్య దూరం పెంచే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే దిద్దుబాటు చర్యలకు దిగారు అమిత్​షా.

Rajasthan, Jun 04 (ANI): A 30-year-old married woman was allegedly raped by five men in Rajasthan's Pali district and the video of the crime uploaded on social media. The incident took place on 26 May. The complaint was registered by the women yesterday. Four accused were arrested till now and police is searching for the fifth accused. While speaking to ANI, a police official said, "She registered a compliant y'day. Accused identified as Jitendra, Govind, Dinesh, Mahendra and Sanjay. We'll arrest the absconding accused soon."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.