ETV Bharat / bharat

సచిన్ పైలట్​ యూటర్న్- రాహుల్​తో చర్చలు! - talks of a likely resolution

రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి అతి త్వరలో తెరపడనుందా? కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తిరిగి సొంత గూటికి రానున్నారు. ఇప్పటికే రాహుల్​తో ఆయన మాట్లాడి... భవిష్యత్​ కార్యాచరణపై చర్చించారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు.

Amid reconciliation talks, Cong leaders hint at Rahul-Pilot meet
రాహల్​ గాంధీతో పైలట్​ వర్గం ఎమ్మెల్యేల భేటీ!
author img

By

Published : Aug 10, 2020, 3:31 PM IST

Updated : Aug 10, 2020, 4:33 PM IST

అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్‌ రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. నిన్నటి వరకు ఎవరి క్యాంపులు వారివే.. ఎవరి వ్యూహాలు వారివే అన్నట్లు సైలెంట్‌గా ఉన్న రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఆయన సోమవారం భేటీ అయ్యారు.

సచిన్‌ పైలట్‌ సహా 18 మంది ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన నాటి నుంచి సచిన్‌ పైలట్‌ను వెనక్కి రప్పించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. అయినా సచిన్‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే, ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ మనసు మార్చుకుని పార్టీలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాహుల్‌, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు పైలట్​. రాహుల్‌తో భేటీ విషయంలో ఇద్దరు పార్టీ సీనియర్‌ నేతలు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

అటు పైలట్​ వర్గం సైతం ఇదే తరహా ప్రకటన చేసింది. అధిష్ఠానం తమతో సంప్రదింపులు జరుపుతోందని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని వెల్లడించింది.

సీఎల్పీ భేటీలో భిన్నాభిప్రాయాలు

ఆదివారం జరిగిన సీఎల్పీ భేటీలో పైలట్‌ వర్గాన్ని పార్టీలోకి తీసుకోవటంపై భిన్నాభిప్రాయలు వెల్లడైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, అశోక్‌ గహ్లోత్‌ మాత్రం పార్టీ అధిష్ఠానానికే తుది నిర్ణయం విడిచిపెట్టినట్లు వెల్లడించాయి. అధిష్ఠానానికి క్షమాపణ చెప్పి, అసెంబ్లీలో బల పరీక్షకు పార్టీకి అనుకూలంగా ఓటేస్తే వారిని క్షమించి తిరిగి తీసుకుంటామని సీడబ్ల్యూసీ సభ్యుడు ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి: ఆ ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ

Last Updated : Aug 10, 2020, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.