ETV Bharat / bharat

సోమవారం రంజాన్​ వేడుకలు!

author img

By

Published : May 23, 2020, 11:44 PM IST

Updated : May 24, 2020, 9:26 AM IST

దేశంలో శనివారం నెలవంక కనిపించనందున.. రంజాన్​ పర్వదినాన్ని సోమవారం జరుపుకోనున్నట్లు తెలిపారు దిల్లీకి చెందిన జామా మసీదు ఇమామ్​ అహ్మద్​ శా బుఖారీ షాహీ.

Amid lockdown, Eid to be celebrated on Monday
సోమవారమే రంజాన్​ వేడుకలు

ఈద్​​ పర్వదినాన్ని సోమవారం జరుపుకోనున్నట్లు దిల్లీకి చెందిన జామా మసీదు ఇమామ్​ అహ్మద్​ శా బుఖారీ షాహీ తెలిపారు. శనివారం నెలవంక కనిపించనందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్​డౌన్​ ఆంక్షల నడుమ.. ప్రజలంతా ఇళ్ల వద్దే నమాజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

శనివారం రుయాత్​-ఇ-హిలాల్​ కమిటీ, ఇమారత్​-ఇ-షరియా హింద్​ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం దేశంలో ఎక్కడా నెలవంక కనిపించలేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా అన్ని మతపరమైన సమావేశాలు నిషేధించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రంజాన్​ రోజున మసీదుల్లో నమాజ్​ జరకపోవడం ఇదే తొలిసారి.

Last Updated : May 24, 2020, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.