ETV Bharat / bharat

'పాక్​ ఉగ్రవాదుల అంతానికి భారత్​-అమెరికా పంతం' - డొనాల్డ్ ట్రంప్ విజిట్ అహ్మదాబాద్ 2020

నమస్తే ట్రంప్​ వేడుకకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​... ఉగ్రవాదంపై మాట్లాడారు. పాకిస్థాన్​లోని ఉగ్రమూకలను తరిమికొట్టే విధంగా భారత్​-అమెరికా కలిసి పనిచేస్తున్నట్టు వివరించారు.

AMERICA PRESIDENT ABOUT TERRORISM AT NAMASTE TRUMP EVENT
'ఉగ్రవాదుల సిద్ధాంతాలపై పోరుకు భారత్​-అమెరికా సిద్ధం'
author img

By

Published : Feb 24, 2020, 2:59 PM IST

Updated : Mar 2, 2020, 9:49 AM IST

'పాక్​ ఉగ్రవాదుల అంతానికి భారత్​-అమెరికా పంతం'

పాకిస్థాన్ సరిహద్దు కేంద్రంగా పని చేసే​ ఉగ్రమూకలను తరిమికొట్టేందుకు భారత్​-అమెరికా కట్టుబడి ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఉద్ఘాటించారు. అందుకే తమ ప్రభుత్వం పాకిస్థాన్​లోని ఉగ్రసంస్థలను అరికట్టడానికి కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

అహ్మదాబాద్​లోని మోటేరా స్టేడియం వేదికగా జరిగిన 'నమస్తే ట్రంప్'​ వేడుకలో పాల్గొన్న ట్రంప్​... ఉగ్రవాదం నిర్మూలనలో భారత్​ నాయకత్వ పాత్ర వహించాలని పిలుపునిచ్చారు.

"తమ సరిహద్దులను భద్రపరుచుకోవడం, నియంత్రించే హక్కు ప్రతి దేశానికి ఉంది. ఉగ్రవాదులను అడ్డుకుని, వారి సిద్ధాంతాలపై పోరాడటానికి అమెరికా-భారత్​ కట్టుబడి ఉన్నాయి. ఇదే విషయమై.. నేను అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి నా యంత్రాంగం.. పాకిస్థాన్​తో చర్చలు జరుపుతోంది. పాక్​తో కలిసి ఉగ్రవాద సంస్థలను అరికట్టి, పాక్​ సరిహద్దు కేంద్రంగా పనిచేసే ఉగ్రమూకలను తరిమికొట్టే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం. ఈ చర్యల వల్ల పాకిస్థాన్​లో సానుకూల స్పందనలు కనపడుతున్నాయి. భవిష్యత్తులో దక్షిణాసియాలో ఉద్రిక్తతలు తగ్గి, శాంతి భద్రతలు మెరుగుపడతాయని ఆశిస్తున్నాం. సమస్యలు పరిష్కరించి శాంతిని నెలకొల్పాలని భారత్​ ఎప్పుడూ అనుకుంటుంది. అందుకే ఈ విషయంలో భారత్ నాయకత్వ​ పాత్ర ఎంతో అవసరం."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

అంతకుముందు.. ఐసిస్​ అధినేత బాగ్దాదీని అమెరికా మట్టుబెట్టిన ఘటనను వివరించారు ట్రంప్​.

Last Updated : Mar 2, 2020, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.