ETV Bharat / bharat

'చైనా ఆక్రమణలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేయాలి' - చైనా ఆక్రమణలపై రాహుల్ గాంధీ

చైనా ఆక్రమణలపై స్వతంత్ర నిజ నిర్ధరణ కమిటీని నియమించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. సరిహద్దులకు సంబంధించి రక్షణ నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని అన్నారు.

RAHUL-CHINA
రాహుల్
author img

By

Published : Jul 11, 2020, 5:32 AM IST

సరిహద్దులకు సంబంధించి రక్షణ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 'భారత్​, చైనా ప్రతిష్టంభన: జవాబుదారీతనం, సంస్కరణల కోసం కేంద్రానికి 144 మంది మాజీ సైనికుల లేఖ' అనే వార్తా కథనాన్ని జోడిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు రాహుల్.

RAHUL-CHINA
రాహుల్ గాంధీ ట్వీట్

"భారత భూభాగాన్ని చైనా ఆక్రమించకుండా కేంద్రం తీసుకున్న చర్యలను దేశ ప్రజలకు తెలియజేయాలి. సరిహద్దులకు అంశాలకు సంబంధించి రక్షణ అనుభవజ్ఞుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. చైనా చొరబాట్లు, ఆక్రమణలను గుర్తించేందుకు స్వతంత్ర నిజనిర్ధరణ కమిటీని నియమించాలి."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

గల్వాన్​లో హింసాత్మక ఘర్షణల తర్వాత నుంచి కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు రాహుల్. చైనా ఆక్రమణలకు ప్రధాని నరేంద్రమోదీ లొంగిపోయారని ధ్వజమెత్తారు.

నిశితంగా పరిశీలిస్తున్నాం..

ప్రస్తుతం భారత్, చైనా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతల తగ్గింపు చర్యలను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్​లోని మరో సీనియర్ నేత పి.చిదంబరం పేర్కొన్నారు. రెండు దేశాల శాంతి ప్రక్రియ, పురోగతిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: సరిహద్దుల్లో శాంతి స్థాపనకు భారత్​, చైనా అంగీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.