ETV Bharat / bharat

సుప్రీంకోర్టు జడ్జీలపై నిందారోపణలు- ముగ్గురికి జైలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై నిందారోపణలు చేసినందుకు ముగ్గురు వ్యక్తులకు మూడు నెలల జైలు శిక్ష పడింది. ఆరోపణలు చేసి ఎలాంటి పశ్చాత్తాపమూ వ్యక్తం చేయకపోవడం వల్ల శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది సర్వోన్నత న్యాయస్థానం.

allegations on supreme court judges
సుప్రీంకోర్టు జడ్జీలపై నిందారోపణలు-ముగ్గురికి జైలు
author img

By

Published : May 7, 2020, 7:40 AM IST

కోర్టు ధిక్కారానికి పాల్పడటంతో పాటు సర్వోన్నత న్యాయస్థానంలోని ఇద్దరు సిట్టింగ్‌ జడ్జీలపై నిందారోపణలు చేసినందుకు ముగ్గురు వ్యక్తులకు సుప్రీంకోర్టు మూడు నెలల పాటు జైలు శిక్ష విధించింది. మహారాష్ట్ర, గోవా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయ్‌కుర్లే, ఇండియన్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నిలేశ్‌ ఓజా, ఎన్‌జీఓ మానవహక్కుల భద్రతా కౌన్సిల్‌ జాతీయ కార్యదర్శి రశీద్‌ఖాన్‌ పఠాన్‌లు ఇద్దరు న్యాయమూర్తులపై నిందారోపణలకు దిగినట్లుగా సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్‌ 27న నిర్ధారించింది.

ఈ ముగ్గురూ ఎలాంటి పశ్చాత్తాపమూ వ్యక్తం చేయకపోవడంతో జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్దాబోస్‌ల నేతృత్వంలోని ధర్మాసనం వీరికి మూడు నెలల జైలు శిక్షతోపాటు, రూ.2వేలు జరిమానా కూడా విధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.