ETV Bharat / bharat

మిడతల కట్టడికి రాజస్థాన్ ప్రభుత్వ​ వ్యూహం ఏమిటి?

కరోనా మహమ్మారి విజృంభణకు తోడు మిడతల దాడి రాష్ట్రాలను కలవరపెడుతోంది. మిడతల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో నివారణ చర్యలు చేపడుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్​లో వాటి ప్రభావం తీవ్రంగా ఉంది. మిడతలపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లను రంగంలోకి దింపింది. ట్రయల్స్​ సత్ఫలితాలను ఇచ్చిన క్రమంలో 30 డ్రోన్లను వినియోగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళికలు రచిస్తోంది.

locust attack!
మిడతల కట్టడికి రాజస్థాన్ ప్రభుత్వ​ వ్యూహం
author img

By

Published : May 31, 2020, 12:41 PM IST

కరోనా వైరస్​ సంక్షోభంతో సతమతమవుతున్న రాష్ట్రాలకు మిడతల దాడి తలనొప్పిగా మారింది. పంటలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని మిగులుస్తోన్న మిడతలను అడ్డుకోవటం వారి ముందున్న అతిపెద్ద సవాలు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్​లో మిడతల ప్రభావం తీవ్రంగా ఉంది. మిడతల కారణంగా అక్కడి రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారు. ​ మధ్యప్రదేశ్​, ఉత్తర్​ ప్రదేశ్​, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే మిడతలను అరికట్టేందుకు రాజస్థాన్​ ప్రభుత్వం డ్రోన్లు, ట్రాక్టర్ల ద్వారా క్రిమిసంహారకాలను పిచికారి చేయటం వంటి అన్ని రకాల నియంత్రణ చర్యలు చేపడుతోంది.

రాజస్థాన్​లో జిల్లాల వారీగా నష్టం..

రాజస్థాన్​లో మిడతల దాడి బీభత్సం 14 జిల్లాలకు వ్యాపించింది. ఆయా జిల్లాల్లో పత్తి, కూరగాయల పంటల దిగుబడి భారీగా తగ్గిపోయింది. నాగౌర్​ జిల్లాలోని ఖాన్​పుర్​ మిజ్రా గ్రామంలో ఓ రైతు పొలంలోని 8-12 అంగుళాల పత్తి మొక్కలను పూర్తిగా తినేశాయంటే వాటి ప్రభావ ఏవిధంగా ఉందో అర్థమవుతుంది.

బికనేర్​1345
చురూ500
జోధ్​పుర్455
జైపూర్​397
శ్రీగంగానగర్​200
బర్మేర్​170
దౌసా 55
నాగౌర్​25
శికర్​20
బరన్​3

మిడతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

ఎడారి మిడతలు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 మిలియన్​ చదరపు కిలోమీటర్లపై ప్రభావం చూపుతున్నాయి. వాయవ్య, తూర్పు ఆఫ్రికా, అరబ్​ దేశాలు, అరేబియా ద్వీపకల్పం, దక్షిణ సోవియట్​ రష్యా, ఇరాన్​, అఫ్గానిస్థాన్​, పాకిస్థాన్​, భారత్​ వంటి దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. సాధారణ రోజుల్లో వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అవి 30 దేశాల్లో దాదాపు 1.6 కోట్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో కనిపిస్తున్నాయి.

2019, మే 16 తర్వాత రాజస్థాన్​లోని జైసల్మేర్​లో ఈ ఎడారి మిడతలు పంటలను ధ్వంసం చేయడం గుర్తించారు అధికారులు. భారత ప్రభుత్వ మిడతల నియంత్రణ, పరిశోధన విభాగం 2019 మేలో 246 ప్రాంతాల్లో సర్వే చేసింది. 46 ప్రాంతాల్లో ఈ మిడతలు ఉన్నట్లు గుర్తించారు.

శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారు?

'కెన్యా, సొమాలియా, ఇథియోపియా, దక్షిణ ఇరాన్​, పాకిస్థాన్​లో కొంత భాగంలో ఎడారులు ఉన్నందున ఈ మిడతల ప్రభావం అధికంగా ఉంటుంది. ఎడారుల్లో వర్షాలు పడిన సమయంలో నీటి కుంటలు ఏర్పడి మిడతల సంతతిని పెంచుకునేందుకు వాతావరణం అనువుగా మారుతుంది. ఈ సందర్భాల్లో సాధారణ పరిస్థితుల్లో కంటే 400 రెట్లు అధికంగా గుడ్లు పెడతాయి. ఇలాంటి వాతావరణ మార్పులు ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్​ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మిడతలు మూడుసార్లు, ఒక్కోసారి 80 గుడ్లు వరకు పెడతాయి.' అని జైపుర్​లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని శాస్త్రవేత్త అర్జున్​ సింగ్​ తెలిపారు.

రైతులకు తీరని నష్టం..

మిడతలు పంటలను నాశనం చేస్తుంటే ఏమి చేయలేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వాటి నుంచి పంటలను కాపాడుకునేందుకు కుటుంబం మొత్తం కాపుకాయాల్సి వస్తోందని చెబుతున్నారు.

కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటి?

'మిడతల విధ్వంసాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోంది. యూకేకు చెందిన 60 సంస్థలతో ఒప్పందం చేసుకుంది. వాటితో పాటు 5 చాపర్​ యంత్రాలతో క్రిమిసంహారకాలు పిచికారి చేసేందుకు నిర్ణయించింది. ప్రభావిత ప్రాంతాల్లో ఆకాశ మార్గాన పిచికారి చేసేందుకు డ్రోన్లును రంగంలోకి దింపుతోంది. రాజస్థాన్​ ప్రభుత్వానికి రూ.14 కోట్లు మంజూరు చేసింది. 800 ట్రాక్టర్ల ద్వారా పిచికారి చేసేందుకు అనుమతులు ఇచ్చింది.' అని కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి కైలాష్​ చౌదరి తెలిపారు.

మిడతల దాడిని అరికట్టేందుకు ఎలాంటి పద్ధతులు ఉన్నాయి?

  • రైతులు తమ పొలాల్లోంచి మిడతలను తరిమేందుకు పాత్రలు, ప్లేట్లు, వివిధ రకాల వాయిద్యాలను వినియోగిస్తున్నారు.
  • టాక్టర్ల ద్వారా క్రిమిసంహారక మందులు పిచికారి చేయటం.
  • చేతి పంపుల ద్వారా క్రిమిసంహారకాల పిచికారి.
  • పొలాలను దున్నటం ద్వారా గుడ్లను నాశనం చేయటం
  • దుమ్ము ద్వారా మిడతలను తరమటం (ఈ పద్ధతికి రాజస్థాన్​ ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపింది).
  • డ్రోన్లు, హెలికాఫ్టర్ల ద్వారా క్రిమిసంహారకాలను పిచికారి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది.

రాజస్థాన్​లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

మిడతలను నిర్మూలించేందుకు ఎడారి ప్రాంతంలో 4*4 వాహనాలను వినియోగించి క్రిమిసంహారకాలను పిచికారి చేస్తోంది రాజస్థాన్​ ప్రభుత్వం. రాత్రిళ్లు చెట్లు, పంటలపై మిడతలు వాలుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్​ అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు చేపడుతున్నారు.

మిడతలతో మున్ముందు వచ్చే ప్రమాదం ఏమిటి?

తూర్పు ఆఫ్రికా నుంచి వచ్చే నెలలో భారత్​, పాకిస్థాన్​కు మిడతలు వలస వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్త అర్జున్​ సింగ్​ చెబుతున్నారు. 'దశాబ్ద కాలంలోనే అత్యంత తీవ్రమైన మిడతల దాడులను చూశాం. ప్రస్తుతం కెన్యా, సొమాలియా, ఇథియోపియా, దక్షిణ ఇరాన్​, పాకిస్థాన్​లోని కొన్ని ప్రాంతాల్లో మిడతల ప్రభావం ఎక్కువగా ఉంది. వచ్చే జూన్​లో సూడాన్​, పశ్చిమ ఆఫ్రికాకు విస్తరించొచ్చు. అరేబియా సముద్రాన్నిదాటుకుని భారత్​, పాకిస్థాన్​కు చేరతాయి. గతంలో 1993లోని మిడతల దాడితో పోలిస్తే ప్రస్తుతం అధిక ప్రభావంఉంది. సాధారణంగా అక్టోబర్​లో చల్లని వాతావరణంతో మిడతలు చనిపోతాయి. కానీ, ఈసారి అలా జరగలేదు, అందుకే వాటి ప్రభావం అధికంగా ఉంది.' అని తెలిపారు సింగ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.