సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనికుల దగ్గర ఆయుధాలు ఎందుకు లేవని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సమాధానమిచ్చారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయ్శంకర్. గస్తీ నిర్వహించే జవాన్ల వద్ద కచ్చితంగా ఆయుధాలు ఉంటాయని ట్విట్టర్లో బదులిచ్చారు. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
-
Let us get the facts straight.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
All troops on border duty always carry arms, especially when leaving post. Those at Galwan on 15 June did so. Long-standing practice (as per 1996 & 2005 agreements) not to use firearms during faceoffs. https://t.co/VrAq0LmADp
">Let us get the facts straight.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 18, 2020
All troops on border duty always carry arms, especially when leaving post. Those at Galwan on 15 June did so. Long-standing practice (as per 1996 & 2005 agreements) not to use firearms during faceoffs. https://t.co/VrAq0LmADpLet us get the facts straight.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 18, 2020
All troops on border duty always carry arms, especially when leaving post. Those at Galwan on 15 June did so. Long-standing practice (as per 1996 & 2005 agreements) not to use firearms during faceoffs. https://t.co/VrAq0LmADp
" సరిహద్దులో విధులు నిర్వహించే బలగాల వద్ద ఎల్లప్పుడూ ఆయుధాలు ఉంటాయి. ప్రత్యేకించి పోస్టులను వదిలి వెళ్లినప్పడు. 15వ తేదీ గాల్వన్ లోయలో ఘటన జరిగినప్పుడూ సైనికులు వద్ద ఆయుధాలున్నాయి. 1996, 2005లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల సైనికులు ఎదురుపడినప్పుడు వాటిని ఉపయోగించడానికి వీల్లేదు."
-ఎస్ జయ్శంకర్, విదేశీ వ్యవహారాల మంత్రి
భాజపా ధ్వజం..
లద్దాక్ సరిహద్దులో ఘటనకు సంబంధించిన విషయంపై రాజకీయ దుష్ప్రచారం ఆపాలని భాజపా కోరింది. రాహుల్ లాంటి బాధ్యతారాహిత్యమైన నాయకుడ్ని దేశం ఎన్నడూ చూడలేదని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించి రాహుల్ అపరిపక్వతతో, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సరిహద్దు విషయంపై చర్చించేందుకు అఖిల పక్ష భేటీని శుక్రవారం నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు.
" ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడితే దేశం మూడు 'సీ'లపై పోరాటం చేస్తుంది. అవి కరోనా వైరస్, చైనా, కాంగ్రెస్. దేశ సమగ్రత విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. రాహుల్ ఎవరినీ నమ్మరు. ప్రధాని, రక్షణ మంత్రి, చివరకు సైన్యాధిపతిపై కూడా ఆయనకు విశ్వాసం లేదు. తప్పుడు రాజకీయ ప్రచారాన్ని ఆపాలి. మీ లాంటి నాయకులను దేశం క్షమించదు. గతంలో సర్జికల్ స్ట్రయిక్ జరిగినప్పుడూ రాహుల్ సందేహాలు వ్యక్తం చేశారు. 2008లో కాంగ్రెస్ హయాం లో భారత్-చైనా మధ్య జరిగిన పరస్పర ఒప్పందాల గురించి సోనియా గాంధీ, రాహుల్ వివరించాలి. "
-సంబిత్ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి.