ETV Bharat / bharat

ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం - ఎర్రకోట

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో ఎన్నడూలేనంత నిరాడంబరంగా.. అతికొద్ది మంది అతిథుల నడుమ సంబరాలు జరగునున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ రెండోసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు.

All set for Independence celebration in Red Fort amid corona crisis
ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
author img

By

Published : Aug 13, 2020, 9:52 PM IST

దేశరాజధాని దిల్లీలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. దేశంలో కరోనా ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకోని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట ప్రాంగణం ఇప్పటికే త్రివర్ణశోభితాన్ని సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేసిన తర్వాత ప్రసంగించేందుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ క్లోజర్, అతిథుల కూర్చుకునేందుకు కూర్చీలు ఏర్పాటు చేశారు.

ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

అతిథుల జాబితా కుదింపు...

కరోనా నేపథ్యంలో స్వాతంత్య్ర వేడుకల అతిథుల జాబితాను 150కి కుదించినట్లు తెలుస్తోంది. ప్రధానికి ఏటా వేల మంది త్రివిధ దళాల సభ్యులు గౌరవ వందనం ఇస్తారు. కానీ కరోనా నేపథ్యంలో ఈసారి కేవలం 22 మంది మాత్రమే ప్రధానికి గౌరవ వందన ఇవ్వనున్నారు. పరేడ్​లోనూ ఈసారి కేవలం 350మంది దిల్లీ పోలీసులు పాల్గొనబోతున్నారు. ఈ పరేడ్​లో పాల్గొనే వారందరినీ 14 రోజుల ముందు నుంచే క్వారంటైన్ చేసినట్లు సమాచారం.

ఎర్రకోటలో ఏర్పాట్లన్నీ పూర్తి కాగా.. గురువారం తెల్లవారుజామున చిరుజల్లుల మధ్యలోనే త్రివిధ దళాలు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించాయి.

కరోనా నిబంధనలు పాటిస్తేనేే..

ప్రధాని మోదీ సహా కొద్దిమంది వీవీఐపీలు, త్రివిధ దళాల సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు, కరోనా వారియర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఏటా 30 వేల మందికిపైగా హాజరయ్యే ఎర్రకోటలో ఈసారి 5 వేల మందితోనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏటా వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశం ఉండేది. కరోనా కారణంగా పాఠశాల విద్యార్థులు హాజరుకావొద్దని అధికారులు ఆదేశించారు. కూర్చీల మధ్య రెండు గజాల దూరం, పారిశుద్ధ్యం, శానిటైజర్లతో పాటు మాస్కులు ధరించాలంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. మాస్కుల ధరిస్తేనే లోపలికి అనుమతించడం సహా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

శనివారం ఉదయం...

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 7 గంటల 21 నిమిషాలకు ఎర్రకోట చేరుకొని 7 గంటల 30 నిమిషాలకు జెండాను ఎగురవేయనున్నారు. ఆ తర్వాత ఎర్రకోట నుంచి జాతీనుద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా ఉద్ధృతి, సవాళ్లు, ఆత్మనిర్భర్​ భారత్ సహా మరిన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధాని ప్రసంగంలో భవిష్యత్​పై ఎలాంటి భరోసా ఉంటుందోనని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇదీ చూడండి- నిఘా నీడలో: స్వాతంత్ర్య వేడుకలకు పటిష్ఠ భద్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.