ETV Bharat / bharat

రామమందిర భూమిపూజకు సర్వం సిద్ధం - ప్రధాని మోదీ అయోధ్య

రామ మందిర నిర్మాణం భూమిపూజ కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయోధ్య. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో ఈ మహా క్రతువు నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హిందువుల కల నెరవేర్చే ఈ బృహత్తర యజ్ఞానికి అతికొద్ది మంది మాత్రమే అతిథులుగా హాజరవుతున్నా.. దేశవ్యాప్తంగా కోట్లమంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అన్ని ఏర్పాట్లు చేసింది.

All set for Ayodhya's Ram mandir foundation event on wednessday
రేపే రామమందిర భూమి పూజ.. చిరకాల స్వప్నానికి తెర
author img

By

Published : Aug 4, 2020, 5:08 PM IST

కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం సాకారమయ్యే అద్భుత క్షణం ఆసన్నమైంది. రామాయణంలోని ఉత్కృష్ట ధర్మాన్ని యావత్​ ప్రపంచానికి చాటిచెప్పే విశ్వమందిర నిర్మాణానికి అంకురార్పణ చేసే ముహూర్తం సమీపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరగనుంది. శ్రీరామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్​ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

అయోధ్య సర్వం సిద్ధం...

శంకుస్థాపన మహోత్సవానికి చారిత్రక అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భవ్య రామమందిర భూమిపూజ సందర్భంగా... అక్కడి ఆలయాలు, రహదారులు సహా అడుగడుగునూ శోభాయమానంగా తీర్చిదిద్దారు. దీపాలతో అయోధ్య వీధులు కళకళలాడుతున్నాయి.

భూమిపూజకు సంబంధించి నగరంలో ఇప్పటికే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శంకుస్థాపన మహోత్సవానికి తరలి రావాలని దేవుళ్లు, దేవతలను ఆహ్వానించడానికి మంగళవారం 'రామార్చన పూజ' చేశారు. వేదమంత్రాలతో రామ జన్మభూమి ప్రాంగణమంతా మారుమోగుతోంది.

All set for Ayodhya's Ram mandir foundation event on wednessday
రామమందిర నమూన

ఇదీ చూడండి:- అయోధ్య రామాలయం నమూనా విడుదల

12 గంటల 15 నిమిషాలకు...

రామమందిర శంకుస్థాపన కోసం ప్రధాని మోదీ బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు అయోధ్యకు చేరుకోనున్నారు. ఆ వెంటనే హనుమాన్​గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాముడిని దర్శించుకునే ముందు ఇక్కడనున్న హనుమంతుడికి పూజలు చేయాలని ప్రజలు విశ్వసిస్తారు. ప్రధాని అక్కడే 5-7 నిమిషాల పాటు ఉంటారు.

అనంతరం అక్కడి నుంచి రామమందిర శంకుస్థాపన వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. అయితే అప్పటికే భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభమవుతుంది. ఆయన వచ్చేలోగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తిచేస్తారు.

రామమందిరం నమూనా

మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో క్రతువు ముగిసేలా ముహూర్తం నిర్ణయించారు. ఆ సయంలో వేద పఠనం, మంత్రోచ్ఛారణల నడుమ ప్రధాని మోదీ స్వయంగా గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే భూమి పూజ కార్యక్రమంలో ఐదు వెండి ఇటుకలను కూడా ఉపయోగించనున్నారు. మధ్యాహ్నం 1:30 వరకు భూమిపూజ జరిగే అవకాశముంది.

ఇదీ చూడండి:- రామమందిర భూమిపూజ కోసం 1,11,000 లడ్డూలు

అతిథులు కుదింపు..

కరోనా వైరస్​ నేపథ్యంలో అతిథుల సంఖ్యను భారీగా కుదించారు. తొలుత 200కుపైగా అతిథులను అనుకున్నప్పటికీ.. ఆ సంఖ్యను 170-180కి పరిమితం చేశారు. ఈ జాబితాలో.. ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌, రామజన్మభూమి న్యాస్‌ అధిపతి నృత్యగోపాల్‌ దాస్‌, సంఘ్‌ నేతలు భయ్యాజీ జోషి, దత్తాత్రేయ హోసబలే, విశ్వహిందూ పరిషత్‌ కార్యాధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ తదితరులతో పాటు దాదాపు 50 మంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. భాజపా అగ్రనేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌జోషిలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.

వేదికపై ప్రధాని మోదీతో పాటు మోహన్‌ భాగవత్‌, నృత్యగోపాల్‌ దాస్‌, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాత్రమే ఉంటారు.

ప్రత్యక్ష ప్రసారం...

కరోనా తీవ్రత దృష్ట్యా శంకుస్థాపన వేడుకకు తరలి రావద్దంటూ అనుచరులకు, భక్తులకు ట్రస్టు నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అయోధ్య, ఫైజాబాద్‌లో ఎల్‌ఈడీ తెరలను, శంకుస్థాపన అనంతరం ప్రధాని ప్రసంగాన్ని వినేందుకు లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేశారు.

రామ మందిర నమూనా

కట్టుదిట్టమైన భద్రత...

అయోధ్య భూమిపూజ, ప్రధాని రాక నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భద్రత బలగాలు అప్రమత్తత ప్రకటించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఇప్పటికే పోలీసులు అయోధ్య వీధుల్లో భారీ స్థాయిలో గస్తీ కాస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

ఇవీ చూడండి:-

అయోధ్య వివాదం ఆరంభం నుంచి భూమిపూజ వరకు..

అయోధ్య రైల్వే స్టేషన్​ కొత్త డిజైన్​ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.