దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ హత్యాచార ఘటన కీలక మలుపులు తిరుగుతోంది. అసలు బాధితురాలిపై అత్యాచారమే జరగలేదన్న పోలీసులకు షాక్ తగిలింది. వారి వాదనకు విరుద్ధంగా మెడికో లీగల్ నివేదిక వచ్చింది.
బాధితురాలు అత్యచారానికి గురైనట్లు అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాల నివేదిక ఇచ్చింది.

యువతిపై అత్యాచారం జరగలేదని, తీవ్ర గాయాలతోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిందని యూపీ ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ గతంలో పేర్కొన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇదీ చూడండి: అత్యాచారం కాదు, హత్యే... హాథ్రస్ కేసులో ట్విస్ట్