తాగిన మైకంలో కన్న కుమార్తె ఏడుపు అతడికి కర్ణకఠోరంగా అనిపించింది. అంతే... పసికందును నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి చంపేశాడు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని నలింగలో జరిగిందీ దారుణం.
ఇదీ జరిగింది
శివాజీ లాలే హోటల్ నడుపుతున్నాడు. కొద్ది సంవత్సరాలుగా మద్యానికి బానిసైపోయాడు. ఆ మత్తులో శనివారం అతడు ఇంటికి వచ్చే సమయానికి ఏడాది వయస్సున్న కుమార్తె ఏడుపు మొదలు పెట్టింది. కోపంతో పసికందును హతమార్చాడు శివాజీ.
శివాజీపై అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.