ETV Bharat / bharat

అకాలీ నేతలు సుఖ్​బీర్​, హర్​సిమ్రత్​ అరెస్టు - sukhbir arrest

పంజాబ్​లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న చండీగఢ్​ పోలీసులు.. కేంద్ర మాజీ మంత్రి హర్​సిమ్రత్​ కౌర్ బాదల్​ను అరెస్టు చేశారు. ముల్లాపుర్​ వద్ద అకాలీదళ్ అధినేత సుఖ్​బీర్​ సింగ్​ బాదల్​ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

akali arrest
అకాలీ నేతల అరెస్టు
author img

By

Published : Oct 1, 2020, 11:02 PM IST

కేంద్ర మాజీ మంత్రి హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​ను చండీగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో భాగంగా చండీగఢ్​- జీరక్​పుర్​ సరిహద్దుకు మద్దతుదారులతో చేరుకున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

ముల్లాపుర్​ వద్ద శిరోమణి అకాలీదళ్​ అధినేత సుఖ్​బీర్​ సింగ్​​ బాదల్​ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

akali arrest
ర్యాలీలో సుఖ్​బీర్​

అణచివేయలేరు: బాదల్

అరెస్టుపై హర్​సిమ్రత్​ ట్విట్టర్​ ద్వారా స్పందించారు. రైతుల కోసం గళం విప్పినందుకు అరెస్టు చేశారని, కానీ తమను అణచివేయలేరని స్పష్టం చేశారు. తామంతా సత్యమార్గాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు.

లాఠీఛార్జి..

హర్​సిమ్రత్​తోపాటు ఎమ్మెల్యేలు ఎన్​కే శర్మ, భూపిందర్ సింగ్​ను కూడా అరెస్టు చేశారు. మద్దతుదారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ముల్లాపుర్​ వద్ద వాటర్​ కెనాన్లను కూడా ఉపయోగించారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​లోని మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి అకాలీ నేతలు కిసాన్ మార్చ్​ నిర్వహించారు. అమృత్​సర్​ స్వర్ణ దేవాలయం వద్ద ర్యాలీలో పార్టీ అధినేత సుఖ్​బీర్​ సింగ్ బాదల్ పాల్గొన్నారు. దామ్​దామ సాహిబ్​ వద్ద జరిగిన ర్యాలీకి హర్​సిమ్రత్​ నేతృత్వం వహించారు.

ఇదీ చూడండి: 'హాథ్రస్'​పై హైడ్రామా- రాహుల్, ప్రియాంక అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.