ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో శరద్ పవార్ భేటీ అయిన విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దేవేంద్ర ఫడణవీస్. శదర్ పవార్ కేవలం తనకు అనుకూలమైన అంశాల్నే బహిర్గతం చేశారని ఆరోపించారు. ఇంకా అనేక అంశాల్ని దాచి ఉంచారన్నారు. సరైన సమయంలో వాటిని ప్రజల ముందు ఉంచుతామన్నారు.
ఓ ప్రముఖ మరాఠీ ఛానెల్‌కి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అజిత్ పవార్‌ను భాజపా సంప్రదించలేదన్నారు. తనకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ అజిత్ పవారే తమని సంప్రదించారని చెప్పుకొచ్చారు.
‘‘మేం ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయాలని ప్రయత్నించలేదు. ఏ పార్టీని చీల్చాలని భావించలేదు. నవంబర్ 23 ప్రమాణస్వీకారానికి కొన్ని రోజుల ముందు అజిత్ పవార్ మా దగ్గరకు వచ్చారు. భాజపాతో కలిసి నడవడానికి ఎన్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడించారు కూడా. శరద్ పవార్‌కి ఈ విషయం తెలుసు’’
- ఫడణవీస్, మాజీ ముఖ్యమంత్రి.
మహారాష్ట్రలో ప్రస్తుత ‘మహా వికాస్ ఆఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముందు భాజపా నేత ఫడణవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, తొలుత తనకు మద్దతిచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ తిరిగి సొంత గూటికి చేరడం వల్ల 80 గంటల్లోపే ఫడణవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇదీ చూడండి : 'సీఎం యోగీ వస్తేనే.. అంత్యక్రియలు నిర్వహిస్తాం'