ETV Bharat / bharat

ఎయిర్​సెల్-మ్యాక్సిస్​ కేసు దర్యాప్తునకు గడువు పెంపు - ఎయిర్​సెల్-మ్యాక్సిస్​ కేసు

ఎయిర్​సెల్-మ్యాక్సిస్​ కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లకు మే 4 వరకు గడువు ఇచ్చింది దిల్లీ కోర్టు. రొగెటరీ లేఖలు పంపిన దేశాల నుంచి సమాధానం అందలేదని, వాటి కోసమే ఎదిరిచూస్తున్నట్లు న్యాయస్థానానికి ఈడీ విన్నవించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కోర్టు.

Aircel-Maxis
ఎయిర్​సెల్-మ్యాక్సిస్​ కేసు
author img

By

Published : Feb 20, 2020, 1:21 PM IST

Updated : Mar 1, 2020, 10:51 PM IST

కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి సంబంధించిన ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది దిల్లీ కోర్టు. ఈ కేసు దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లకు మే 4వ తేదీ వరకు గడువు ఇచ్చింది.

నాలుగు దేశాలకు పంపిన (లెటర్స్​ రొగెటరీ) లేఖలకు సమాధానం అందలేదని, వాటి కోసమే ఎదిరుచూస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అజయ్​ కుమార్​ కుహార్​కు విన్నవించింది ఈడీ. దర్యాప్తు సంస్థ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు జడ్జి.

సెప్టెంబర్​ 5న నిరవధిక వాయిదా..

విదేశాల నుంచి సమాచారం (లెటర్స్​ రొగటరి) రావాల్సి ఉన్నందున ఈ కేసులో విచారణను వాయిదా వేయాలని ఈడీ, సీబీఐలు పలుమార్లు కోరిన సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్​ 5న నిరవధిక వాయిదా వేసింది కోర్టు. దర్యాప్తు ముగిసిన తర్వాత ఎప్పుడైనా తిరిగి కోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది. విచారణకు సంబంధించి ఎలాంటి తేదీలు ప్రకటించలేదు.

ఇదీ కేసు..

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండగా ఎయిర్​సెల్​, మ్యాక్సిస్ సంస్థల మధ్య రూ.3,500 కోట్లు విలువైన ఒప్పందం జరిగింది. ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు మంజూరు చేయడంలో భారీ అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ.

ఇదీ చూడండి: చిన్మయానంద్​​ కేసుపై వచ్చేవారం విచారణ : సుప్రీం

Last Updated : Mar 1, 2020, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.