ETV Bharat / bharat

'గాలిలో కరోనా వ్యాప్తికి కారణం అదే' - ఎరోసోల్స్​

గాలిలో కరోనా వైరస్​ వ్యాప్తికి కారణం ఎరోసోల్స్ అయ్యే అవకాశముందని​ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఎరోసోల్స్​ చిన్న తుంపర్ల సైజులో ఉంటాయని పేర్కొంది. పలు ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య ప్రక్రియ ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయని తెలిపింది.

Airborne transmission of Covid-19 can occur through aerosols: Health Ministry
'గాలిలో కరోనా వ్యాప్తికి కారణం అదే'
author img

By

Published : Sep 15, 2020, 7:40 PM IST

ఎరోసోల్స్​గా పిలిచే చిన్నపాటి తుంపర్ల​ ద్వారా.. గాలిలో కరోనా వైరస్​ వ్యాప్తి చెందే అవకాశముందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పలు ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య ప్రక్రియల్లో భాగంగా ఇవి ఉత్పత్తి అయ్యే అవకాశముందని పేర్కొంది.

కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని కమార్​ చౌబే.. పార్లమెంట్​ వేదికగా ఈ ప్రకటన చేశారు. దీని ద్వారా.. గాలిలో వైరస్​ వ్యాప్తిపై మరింత స్పష్టత వచ్చింది.

ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ...

దేశంలోని 77శాతం యాక్టివ్​ కేసులు.. కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్టు పేర్కొన్నారు అశ్విని చౌబే. అవి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​, తమిళనాడు, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, తెలంగాణా, అసోం, కేరళ అని స్పష్టం చేశారు.

వ్యాక్సిన్​ విషయాన్ని కూడా ప్రస్తావించారు ఆరోగ్యశాఖ సహాయ మంత్రి. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్థమైన వ్యాక్సిన్​ను తీసుకురావడానికి కేంద్రం, వైద్య సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని వెల్లడించారు. అయితే వ్యాక్సిన్​ ఎప్పుడు విడుదల అవుతుందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.

ఇదీ చూడండి:- టాయిలెట్​లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.