ETV Bharat / bharat

వాయుకాలుష్యంతో 'కళ్లు' పోతాయ్​..! - vision loss

గాలి కాలుష్యం కారణంగా చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదముందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్​ లండన్ చేసిన ఓ అధ్యయనం.. ఏజ్​ రిలేటెడ్ మాకులర్ డీజెనరేషన్ అనే వ్యాధి బారినపడటానికి కలుషిత గాలి దోహదం చేస్తుందని తేల్చింది.

Air pollution linked to increased risk of irreversible vision loss: Study
వాయుకాలుష్యంతో శరీరంలోని ఆ భాగానికి తీరని నష్టం
author img

By

Published : Jan 26, 2021, 9:05 PM IST

Updated : Jan 26, 2021, 9:33 PM IST

వాయు కాలుష్యం.. గుండె, ఊపిరితిత్తులకే కాదు.. కళ్లకు కూడా చేటేనని యూనివర్సిటీ ఆఫ్​ లండన్​కు చెందిన ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. కలుషితమైన గాలి కారణంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, అది ఎప్పటికీ తిరిగిరాదని స్పష్టం చేస్తోంది.

చూపు కోల్పోయిన అనంతరం దానిని దక్కించుకోలేని పరిస్థితిని ఏజ్​ రిలేటెడ్ మాకులర్ డీజెనరేషన్(ఏఎండీ) అంటారు. ధనిక దేశాల్లో ఉన్న వయోధికుల్లో ఈ తరహా వ్యాధులు ఎక్కువగా వస్తాయని పరిశోధకులు వెల్లడించారు. 2040 నాటికి ఏఎండీ బాధితుల సంఖ్య 30 కోట్లు దాటుతుందని అంచనా.

2006ను అధ్యయనం చేస్తున్నారు. ఇందు కోసం ఐరోపాలోని బయోబ్యాంకులో ఉన్న లక్ష 15వేల నమూనాలను సేకరించారు. అవి 40 నుంచి 60 ఏళ్ల వయసున్న.. దృష్టిలోపం లేని వ్యక్తులవి. వివిధ గాలి కాలుష్య స్థాయిల్లో వాటిని పరిశీలించారు. ఈ క్రమంలో పార్టిక్యులర్ మ్యాటర్​(2.5)కు ఎక్కువగా ప్రభావితమైనవారి ఏఎండీ ప్రమాదం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ఇతర కాలుష్య కారకాల బారినపడిన వారిలో రెటీనా దెబ్బతింటోందని వెల్లడైంది.

ఇదీ చూడండి: కొవిడ్ బాధితుల్లో కోమా, మతిమరుపు సమస్యలు

Last Updated : Jan 26, 2021, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.