ETV Bharat / bharat

దిల్లీలో మళ్లీ కోరలు చాస్తోన్న వాయు కాలుష్యం - దిల్లీలో వాయు కాలుష్యం

రుతుపవనాల తిరోగమనం, స్థిరమైన గాలుల కారణంగా దిల్లీలో మళ్లీ వాయు కాలుష్యం పెరుగుతోంది. రోహిణి, జహంగీర్​పురిలో వాయు నాణ్యత సూచీ 200 పాయింట్లు దాటింది. సరిహద్దు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత కూడా స్వల్ప ప్రభావం చూపుతోందని కేంద్రం వెల్లడించింది.

DELHI POLLUTION
దిల్లీ కాలుష్యం
author img

By

Published : Oct 3, 2020, 2:13 PM IST

దేశ రాజధాని దిల్లీ మళ్లీ కాలుష్యం కోరలు చాస్తోంది. లాక్​డౌన్ సమయంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న రాజధాని నగరం విష కూపంలోకి జారుకుంటోంది. నగరంలోని రోహిణి, జహంగీర్​పురిలో వాయు నాణ్యత భారీగా క్షీణించిందని దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) తెలిపింది.

రుతుపవనాల తిరోగమనం, స్థిరమైన గాలులు దిల్లీలో వాయునాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపాయని డీపీసీసీ తెలిపింది.

ఈ ప్రాంతాల్లో..

జహంగీర్​పురిలో 230, రోహిణిలో 206గా వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) నమోదైంది. దీన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తీవ్ర స్థాయిగా పరిగణిస్తుంది. ఈ గాలిలో ఎక్కువ సమయం ఉంటే శ్వాస ఇబ్బందులు తలెత్తుతాయి. ఆనంద్​ విహార్​లో మధ్యస్థంగా 178గా నమోదైంది.

వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత..

మరోవైపు పంజాబ్, హరియాణాలోని దిల్లీ సరిహద్దు ప్రాంతాలలో వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతలు పెరుగుతున్నాయని కేంద్ర వాయునాణ్యత, వాతావరణ పరిశోధన సంస్థ- 'సఫర్'​ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో వీటి ప్రభావం దిల్లీపై స్వల్పంగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ వేళ... ఊపిరి హాయిగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.