ETV Bharat / bharat

'అమెరికా, కెనడాలకు 75 ఎయిరిండియా విమానాలు' - ఎయిరిండియా తాజా వార్తలు

అమెరికా, కెనడాలకు వెళ్లే వారికోసం 75 విమానాలను పంపనుంది ఎయిరిండియా. 'వందే భారత్​ మిషన్​'లో భాగంగా చేపట్టిన ఈ ప్రక్రియకు ఈ నెల 5 నుంచి బుకింగ్స్​ ప్రారంభం కానున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

Air India to operate 75 outbound passenger flights
అమెరికా, కెనడాలకు 75 ఎయిరిండియా విమానాలు
author img

By

Published : Jun 4, 2020, 5:23 PM IST

ఎయిరిండియాకు చెందిన 75 విమానాల ద్వారా అమెరికా, కెనడా దేశాలకు ప్రయాణికులను తరలిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. 'వందే భారత్​ మిషన్​'లో భాగంగా ఈ నెల 9 నుంచి 30 వరకు ఈ ప్రాజెక్ట్​ చేపట్టనున్నట్లు తెలిపింది.

ఈ నెల 5న సాయంత్రం 5 నుంచి..

అమెరికా, కెనడా దేశాలకు వెళ్లాలనుకున్నవారు.. విమాన సేవల నిబంధనలకు అనుగుణంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది కేంద్రం. ఇందుకోసం ఎయిరిండియా వెబ్​సైట్​లో.. ఈ నెల 5న సాయంత్రం 5 గంటలకు బుకింగ్స్​ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొన్ని విదేశీ విమానయాన సంస్థలు ఈ ప్రక్రియను చేపట్టగా.. మరికొన్ని సంస్థలూ అదే బాటలో నడవనున్నాయి.

విదేశీయులకూ అనుమతి

అయితే ఈ ఫ్లైట్స్​ ద్వారా విదేశీ ప్రయాణికులకు కూడా అనుమతినిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి హర్దీప్​ సింగ్​ పూరి తెలిపారు. గతంలో నిర్దేశించిన విధంగా 75 విమానాలు.. న్యూయార్క్​, నెవార్క్​, చికాగో, వాషింగ్​టన్​, శాన్​ఫ్రాన్సిస్కో, వాంకౌవర్​, టొరంటో వంటి ప్రముఖ ప్రాంతాలను వెళ్లనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో సుమారు రెండు నెలల లాక్​డౌన్​ అనంతరం.. మే 25 నుంచి దేశీయ విమానయాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.

ఇదే తొలిసారి

విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం 'వందేభారత్​ మిషన్​'ను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రక్రియ మే 7 న ప్రారంభమైంది. అయితే మిషన్​లో భాగంగా విదేశాలకు తరలించడం ఇదే తొలిసారి.

ఇదీ చదవండి: నేడో, రేపో భారత్​కు మాల్యా.. నేరుగా కోర్టుకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.