భువనేశ్వర్‌నుంచి 180మంది ప్రయాణికులతో ముంబయికి వెళ్తోన్న ఎయిర్ ఇండియా విమానం ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్ విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
విమానంలో అనుకోకుండా అగ్నిప్రమాద అల్లారం మోగడం వల్ల ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించింది. ఎలాంటి ప్రమాదం జరగలేదని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అల్లారం మోగిందని వెల్లడించారు అధికారులు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'70 ఏళ్లలో కానిది 70 రోజుల్లో పూర్తి చేశాం'