ETV Bharat / bharat

వాయిసేనలో బదిలీలు.. కీలక విభాగాలకు నూతన అధికారులు

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కీలక కమాండ్లకు నూతన అధికారులను నియమించింది భారత వాయుసేన. దిల్లీలోని పశ్చిమ​ వైమానిక విభాగ ముఖ్య అధికారి బాధ్యతలను ఎయిర్​ మార్షల్​ వివేక్ రామ్​ చౌదరికి అప్పగించింది. లద్దాఖ్ సహా రాజస్థాన్​- పాకిస్థాన్​ సరిహద్దు వద్ద గగనతల రక్షణకు ఆయన నేతృత్వం వహించనున్నారు.

air
వాయిసేనలో బదీలీలు.. కీలక విభాగాలకు నూతన అధికారులు
author img

By

Published : Jul 25, 2020, 8:13 PM IST

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలాన్ని మరింత కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది భారత వాయుసేన. చైనా, పాకిస్థాన్​ సరిహద్దులు సహా దేశంలోని కీలక కమాండ్లకు నూతన అధికారులను నియమించింది. లద్దాఖ్​ సహా రాజస్థాన్​-పాకిస్థాన్​ సరిహద్దు ప్రాంతాలను పర్యవేక్షించే దిల్లీ పశ్చిమ వైమానిక విభాగ బాధ్యతలను ఎయిర్​ మార్షల్​ వివేక్ రామ్​ చౌదరికి అప్పగించింది. ఆగస్టు 1న ఆయన నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. 9 నెలలుగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎయిర్ మార్షల్​ సురేశ్ స్థానాన్ని వివేక్ భర్తీ చేయనున్నారు.

షిల్లాంగ్​లోని తూర్పు కమాండ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎయిర్​ మార్షల్ ఆర్​డీ మాథుర్​ను.. బెంగళూరులోని వైమానిక శిక్షణ కేంద్రానికి బదిలీ చేసింది. అక్టోబరు 1నుంచి ఆయన అక్కడ విధులు నిర్వహిస్తారు. తూర్పు​ కమాండ్​​కు మాథుర్​ స్థానంలో ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్​ను నియమించింది. సిక్కిం-హిమాచల్​ ప్రదేశ్ మధ్య చైనా సరిహద్దు సహా.. ఈశాన్య ప్రాంతం మొత్తాన్ని తూర్పు కమాండ్ అధికారి పర్యవేక్షిస్తారు.

కార్గిల్​ యుద్ధ శౌర్య పురస్కారం పొందిన ఎయిర్​ మార్షల్​ దిలీప్​ కుమార్ పట్నాయక్​కు ప్రయాగ్​రాజ్​లోని సెంట్రల్​ ఎయిర్​ కమాండ్​లో సీనియర్​ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్​(ఎస్​ఏఎస్ఓ)గా నియమించింది వాయుసేన.

పశ్చిమ ఎయిర్​ కమాండ్​కు ఎస్​ఏఎస్​ఓగా ఎయిర్​ మార్షల్ విక్రమ్​ సింగ్ నియమితులయ్యారు. గతేడాది రఫేల్ కేసులో సుప్రీంకోర్టుకు వివరాలు తెలిపిన ఎయిర్​మార్షల్​​ జే చలపతి.. త్రివేండ్రంలోని దక్షిణ​ ఎయిర్ కమాండ్​ ఎస్ఏఎస్ఓ​గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇదీ చూడండి: భారత్​లో ఒక్కరోజే 4.20 లక్షల కరోనా టెస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.