ETV Bharat / bharat

సాయుధ బలగాల కోసం ఎయిర్ అంబులెన్స్​ - soldiers

శత్రువులతో పోరాడే క్రమంలో తీవ్రంగా గాయపడి కొన్నిసార్లు సరైన సమయానికి వైద్యం అందక సాయుధ జవాన్లు కన్నుమూసిన ఉదంతాలెన్నో. వీరులు ఇకపై అలా మరణించకుండా తక్షణ చికిత్స అందించేందుకు ఎయిర్​ అంబులెన్స్​ సిద్ధం చేసింది సర్కార్.

సాయుధ బలగాల కోసం ఎయిర్ అంబులెన్స్​!
author img

By

Published : Jul 28, 2019, 5:46 PM IST

సైనిక బలగాల కోసం తొలి ఎయిర్​ అంబులెన్స్​ మంజూరైంది. సరిహద్దు భద్రత దళాల​(బీఎస్​ఎఫ్​)కు చెందిన ఎమ్ఐ-17 హెలికాప్టర్​లో ఈ అంబులెన్స్​ సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తయారైన ఈ ఎయిర్​ అంబులెన్స్ ఝార్ఖండ్​ రాజధాని రాంచీ కేంద్రంగా పనిచేస్తుంది.

నక్సల్స్​తో, ఉగ్రవాదులతో పోరాడే సైనికుల కోసం మొట్టమొదటిసారి ఈ 24గంటల అంబులెన్స్ సేవలను సమకూర్చింది ప్రభుత్వం.
ప్రత్యేకించి నక్సల్స్​తో పోరాడుతూ, ఎత్తైన సరిహద్దు​ల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు ఈ అంబులెన్స్​ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ హెలికాప్టర్​లో వైద్యుల బృందంతో పాటు, నర్సులు, సహాయకులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఈ చాపర్​లో స్టెబిలైజర్స్​, ఆక్సిజన్​ సిలిండర్​ వంటి అత్యవసర వైద్య పరికరాలు ఉన్నాయి.

ఉద్రిక్త పరిస్థితుల్లో గాయపడ్డ సైనికుల దగ్గరకు వైద్యులే ఈ హెలికాప్టర్​లో వెళ్లి ప్రథమ చికిత్స అందిస్తారు. ఆపై క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలిస్తారు.
ఈ సేవలను మొదటగా నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న లక్షకుపైగా సైనికులకు అందించాలని యోచిస్తున్నారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర పోలీసులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటుంది ఈ చాపర్​.

ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​, జమ్ముకశ్మీర్​లోని లద్దాఖ్​ లాంటి హైఅలర్ట్​ ప్రాంతాల్లో రెండేసి హెలికాప్టర్ అంబులెన్స్​లను ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ సౌకర్యం విలువైన సమయంలో అందుబాట్లోకి వచ్చి.. యుద్ధంలో గాయపడే సైనికులకు సత్వర సేవలందించడంలో సహకరిస్తుంది. అందుకే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండో ఎయిర్​ అంబులెన్స్​ను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర సాయుధ బలగాల్లో భాగమైన సీఆర్​పీఎఫ్​, బీఎస్​ఎఫ్​, ఇండో-టిబెటన్​ సరిహద్దు పోలీసు దళాలు, సీఐఎస్​ఎఫ్​, సశస్త్ర సీమా బల్​, ఎన్​డీఆర్​ఎఫ్​ బలగాలకు ఈ సేవలు అందనున్నాయి.

ఇదీ చూడండి:వాయుసేన అమ్ముల పొదిలో 'అపాచీ' హెలికాప్టర్లు

Intro:Body:

e

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.