ETV Bharat / bharat

కరోనా చికిత్సపై శిక్షణ కోసం వైద్యులకు జాతీయ వేదిక

కేంద్ర ఆరోగ్యశాఖ, నీతి ఆయోగ్​ సహకారంతో దిల్లీ ఎయిమ్స్​ చేపట్టిన "నేషనల్​ క్లినికల్​ గ్రాండ్​రౌండ్స్​ ఆన్​ కొవిడ్​-19" అనే జాతీయ వేదిక నేడు ప్రారంభంకానుంది. ఈ వేదిక ద్వారా దేశంలోని వైద్యులు.. కరోనాకు తాము అందిస్తున్న చికిత్స పద్ధతులను పంచుకోవచ్చు. ఇతర వైద్యులు వీరి నుంచి శిక్షణ పొందవచ్చు.

AIIMS to start best practices sessions for doctors across India on COVID-19 management
కరోనా చికిత్సపై శిక్షణ కోసం వైద్యులకు జాతీయ వేదిక
author img

By

Published : Jul 22, 2020, 5:39 AM IST

దేశంలోని ప్రతి వైద్యుడు.. కరోనా చికిత్సపై అవగాహన పొందే విధంగా దిల్లీ ఎయిమ్స్​ చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ, నీతి ఆయోగ్​ సహకారంతో.. "నేషనల్​ క్లినికల్​ గ్రాండ్​రౌండ్స్​ ఆన్​ కొవిడ్​-19" అనే జాతీయ వేదికను బుధవారం ప్రారంభించనుంది.

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. బాధితులకు తాము అందించిన చికిత్స వివరాలను వైద్యులు పంచుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని నీతి ఆయోగ్​ సభ్యుడు డా. వీకే పాల్​ తెలిపారు.

"ఇది దేశనలుమూల్లో ఉన్న వైద్యులకు ఉపయోగపడుతుంది. మారుమూల గ్రామంలో ఉన్నా కూడా ఈ వేదికను వినియోగించుకుని కరోనా బాధితుల చికిత్సపై శిక్షణ పొందవచ్చు. ఇందుకు వైద్యులు covid.aiims.edu/cgrలో లాగిన్​ అవ్వాలి. ఇందులో ఎయిమ్స్​తో పాటు ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులు కూడా ఉంటారు."

--- డా. వీకే పాల్​, నీతి ఆయోగ్​ సభ్యుడు.

కరోనా వైరస్​ వల్ల శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైద్యులు ఏ అంశాలపై శిక్షణ పొందాలనుకుంటున్నారో తెలుసుకుంటామని.. దానికి తగినట్టుగా సెషన్లను ఏర్పాటు చేస్తామని ఎయిమ్స్​ డైరక్టర్​ డా. రణ్​దీప్​ గులేరియా పేర్కొన్నారు. వారంలో గంటన్నర సేపు ఈ సెషన్లు ఉంటాయన్నారు.

ఇదీ చూడండి:- 'దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరలేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.