తమిళనాడు తిరుపత్తూర్లో వాహనాలతో కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించి.. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించారు అధికార అన్నాడీఎంకే మంత్రులు. వీరి చర్యల పట్ల జిల్లా వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేేసీ వీరమణి చర్యల పట్ల అసహనం వ్యక్తం చేశారు.
ఎగబడిన జనం..!
తిరుపత్తూర్ జిల్లా జొల్లారిపెట్టాయిలో 80 వేల మందికి నిత్యావసర సరకులు అందించే ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే కార్యక్రమంలో కరోనా జాగ్రత్తలు పాటించే విషయాన్ని విస్మరించారు. కనీసం మాస్కులు లేకుండా సరుకుల కోసం భారీగా ఎగబడ్డారు గ్రామస్థులు. సామజిక దూరం నిబంధనలు పట్టించుకోలేదు.
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.