ETV Bharat / bharat

వచ్చే వారమే అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ప్రకటన - ఏఐడీఎంకే సీఎం అభ్యర్థి తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ఎవరు పోటీ పడతారనే విషయాన్ని అక్టోబర్ 7న ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం అభ్యర్థిని అగ్రనేతలు పనీర్ సెల్వం, పళనిస్వామి సంయుక్తంగా ప్రకటిస్తారని స్పష్టం చేశాయి.

AIADMK will announce its CM candidate on OCT 7, Says Dy coordinator KP Munusamy
వచ్చే వారమే అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ప్రకటన
author img

By

Published : Sep 28, 2020, 6:58 PM IST

తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును అక్టోబర్ 7న ప్రకటించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. సీఎం అభ్యర్థి పేరును పార్టీ అగ్రనేతలు పనీర్ సెల్వం, పళనిస్వామి ప్రకటిస్తారని అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ మునిసామి వెల్లడించారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వీరు ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు పోటీ చేయాలనే అంశంపై సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పనీర్​సెల్వం మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.

ఈ అంశంపై ఇటీవలే ఇరువురు నేతలు కలిసి పార్టీ నేతలందరికీ నోటీసులు జారీ చేశారు. సీఎం అభ్యర్థిత్వంపై బహిరంగంగా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదని ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.