ETV Bharat / bharat

'ఉంటారా.. వెళతారా?'- భాజపాకు అన్నాడీఎంకే అల్టిమేటం! - తమిళనాడు లేటెస్ట్​ న్యూస్​

తమిళనాడులో మిత్రపక్షాలు అన్నాడీఎంకే, భాజపా మధ్య పొత్తు విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. కూటమి సీఎం అభ్యర్థిగా కే పళనిస్వామి పేరును ప్రకటిస్తేనే కమలం పార్టీతో కలిసి ముందుకేళ్లే విషయంపై ఆలోచిస్తామని అన్నాడీఎంకే తేల్చి చెప్పింది. రాష్ట్రంలో పెద్దన్న పాత్ర తమదేనని, ఇతర పార్టీల మద్దతు తమకు అవసరం లేదని స్పష్టం చేసింది. భాజపా మాత్రం ఈ విషయంపై మౌనం వహిస్తోంది. రజనీ కొత్త పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

AIADMK says it is big brother in TN, asks BJP to fall in line or rework its 2021 poll options
ఉంటారో పోతారో తేల్చుకోండి.. భాజపాకు ఏడీఎంకే హుకుం
author img

By

Published : Dec 27, 2020, 7:18 PM IST

తమిళనాడులో భాజపా ఏ మాత్రం ప్రభావం చూపలేదని దాని మిత్రపక్షం, అధికార అన్నాడీఎంకే నిర్మొహమాటంగా చెప్పింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే కమలం పార్టీకి ప్రభుత్వంలో అవకాశం ఇవ్వబోమని తెల్చిచెప్పింది. ఒకవేళ భాజపా తమ మిత్రపక్షంగా కొనసాగాలనుకుంటే సీఎం కే పళనిస్వామిని కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని స్పష్టం చేసింది.

చెన్నైలో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో అన్నాడీఎంకే సీనియర్ నేత, డిప్యూటీ కోఆర్డినేటర్​ కేపీ మునుస్వామి.. భాజపాకు తమ అభిప్రాయాన్ని ముక్కుసూటిగా తెలిపారు. రాష్ట్రంలో పెద్దన్న పాత్ర తమదేనని స్పష్టం చేశారు. పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా ప్రభుత్వంలో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు భాజపా అంగీకరిస్తేనే ఆ పార్టీతో పొత్తు ఉంటుందన్నారు. ఈ షరతులపై భాజపా పునరాలోచించుకుని కూటమిలో ఉండాలో? వద్దో? తేల్చుకోవాలన్నారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ మద్దతు అవసరం లేదన్నారు.

అవకాశం కోసం చూస్తున్నారు..

తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి వంటి మహానేతల మృతి అనంతరం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని భావిస్తున్న కొన్ని పార్టీలు పాగా వేయాలని చూస్తున్నాయని మునుస్వామి తెలిపారు. పలు జాతీయ పార్టీలు, అవకాశవాదులు, నమ్మకద్రోహులు.. ద్రవిడ పార్టీలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.

అన్నాడీఎంకే చెన్నైలో నిర్వహించిన ర్యాలీలో సీఎం కే పళనిస్వామి, డిప్యూటీ సీఎం పనీర్​సెల్వం కూడా పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు మునిస్వామి. తమ మద్దతు లేకుండా తమిళనాడులో భాజపా ఎదగలేదనే సందేశాన్ని పంపారు.

ద్రవిడ సంస్కృతి

దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే తమిళనాడు పూర్తిగా భిన్నమని మునుస్వామి అన్నారు. అక్కడి సామాజిక-రాజకీయ పిరిస్థితులు ద్రవిడ ఉద్యమంతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. తమిళుల సంస్కృతి, భాష, విలువలు దానిపైనే నిర్మితమయ్యామని పేర్కొన్నారు. అందుకే 5 దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని అన్నాడీఎంకే, డీఎంకే మాత్రమే పాలించాయని, జాతీయ పార్టీలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయని చెప్పారు.

భాజపా మౌనం..

ప్రస్తుతం భాజపా, అన్నాడీఎంకే మిత్రపక్షాలుగానే ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో కూటమి సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై కమలం పార్టీ గతకొద్దినెలలుగా మౌనం వహిస్తోంది. ఈ నిర్ణయం పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఇటీవల తమిళనాడు వచ్చిన కేంద్రమంత్రి పకాశ్​ జావడేకర్ కూడా ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు.

అయితే రజనీ కొత్తగా స్థాపించే పార్టీతో భాజపా పొత్తు పెట్టువాలని చూస్తోందని, అందుకే అన్నాడీఎంకేతో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తోందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. లేకపోతే అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఎక్కువ కేబినెట్​ మంత్రి పదవులు డిమాండ్​ చేయాలనే ఉద్దేశంతోనే కమలం పార్టీ ఈ ధోరణి అవలంబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: రజనీ రాకతో తమిళనాట పొత్తులాట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.