మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీ పీస్ ఫౌండేషన్ అధ్యక్షుడు కుమార్ ప్రశాంత్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి
ప్రశ్న: నేటి ఆధునిక యుగంలో గాంధేయ సిద్ధాంతాల ఔచిత్యం ఏమిటి?
జవాబు: ప్రస్తుతం మన దేశం ఏ దిశగా ప్రయాణించాలో నిర్ణయించుకోలేని స్థితిలో ఉంది. కనీసం తమకంటూ ఒక ఆలోచన దృక్పథం లేని కొందరు వ్యక్తులు నేడు మిగతావారిని నిర్దేశిస్తున్నారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది.
కానీ మంచి విషయం ఏమిటంటే... దేశం ఏ దిశగా పయనించాలో నిర్ణయించుకునే అవకాశం మనకు ఇంకా ఉంది. అదే గాంధేయ మార్గం. ఈ దేశ ప్రజలు గాంధీ ముందుచూపుపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారు. ఆయన సిద్ధాంతాల నుంచి ప్రేరణ పొందారు. మహాత్ముని అడుగుజాడల్లో నడిచి, ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తే చాలు... అదే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను.
ప్రశ్న: ఇటీవలి 'వీర్ సావర్కర్' వివాదం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు: ఈ దేశంలో ఎవరూ సమస్యలకు పరిష్కారం అందించలేరు. 'జై శ్రీరామ్' అని జపించని వారు దేశం విడిచి వెళ్లిపోవాలని కొందరు అంటుంటారు. ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇదే విషయన్ని చెప్పారు.
సావర్కర్‌కు తనకంటూ ఓ సొంత ఆలోచన లేదు. ఆయన సమాజంలో ఏం చూశారో, అదే నేర్చుకున్నారు. తనతో విభేదించే వ్యక్తులపై ఆధిపత్యం చెలాయించడం నేర్చుకున్నారు. కాదన్న వారిని చంపారు. గాంధీజీ విషయంలోనూ ఇలానే ప్రవర్తించారు.
ప్రశ్న: అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు గాంధీజీ పేరును జపిస్తుంటారు. మరోవైపు ఆ మహాత్మునిపైనే విమర్శలు చేస్తారు. ద్వంద్వ వైఖరులు ప్రదర్శించే ఇలాంటి వారి సంగతేంటి?
జవాబు: ముసుగు వేసుకున్నంత మాత్రాన అది మీ నిజ స్వరూపాన్ని కప్పి ఉంచలేదు. ఇలాంటి కొందరు ముసుగు వేసుకున్న వ్యక్తులు గాంధీ సిద్ధాంతాలు వల్లిస్తూ తమ నిజమైన ముఖాలనే మర్చిపోయారు. వీళ్ల నిజ స్వరూపం ఏమిటో సమాజానికి తెలుసు. కనుక ఈ విషయంలో మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.
ప్రతి ఒక్కరూ మొదటి నుంచే... తప్పుడు చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలి. పాత్రికేయులు కలము లేదా మైక్ పట్టుకొని తమ పనిని నిజాయితీగా చేయాలి. అప్పుడే సమాజంలో మార్పు ప్రారంభమవుతుంది.
ఇదీ చూడండి: జాబిల్లిని ముద్దాడే వేళ... విక్రమ్, ప్రజ్ఞాన్ పరిహాసాలు