ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 53వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు. తొలిసారి శివసేనేతర పార్టీ ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమానికి ఫడణవీస్ హాజరవటం ప్రాధాన్యత సంతరించుకుంది.
శివసేన వ్యవస్థాపక కార్యక్రమానికి హాజరుకావాలని ఫడణవీస్కు ఠాక్రే ప్రత్యేక ఆహ్వానం పంపారు.
" కాషాయ జెండా కోసం ఇరు పార్టీలు పనిచేస్తున్న నేపథ్యంలో సొంత ఇంటిలోనే ఉన్నట్లు ఉంది. ఉద్ధవ్ ఠాక్రే నాకు పెద్ద అన్నయ్య. గతంలో భాజపా, సేనా మధ్య పలు తేడాలు ఉండేవి. కానీ చాలా ఏళ్లుగా కూటమిగా కలిసి ఉన్నందున పార్టీల మధ్య ఉన్న తేడాలు తొలగిపోయాయి. ప్రస్తుతం పులి, సింహం మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి."
- దేవేంద్ర ఫడణవీస్, మహరాష్ట్ర ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: 'న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి'